
చాణక్యుడి ప్రబోధాల ప్రకారం ఒక వ్యక్తిని మేధావిగా చేయగల ముఖ్యమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటి లక్షణం కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి. తెలివైన వ్యక్తులు ఎల్లప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని తపనగలుగుతారు. వారు సాంకేతికత, విజ్ఞానాన్ని సంపాదించేందుకు ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు. జీవితంలో ఎదగటానికి, విజయం సాధించడానికి అవకాశాలను సృష్టించి వాటిని సద్వినియోగం చేసుకోవడం మేధావుల గొప్ప లక్షణం.
చాణక్యుడు ప్రతిపాదించిన మరో ముఖ్యమైన లక్షణం స్వీయ నియంత్రణ. మేధావులు తమ భావోద్వేగాలను నియంత్రించగల సత్తా కలిగివుండాలి. ఆలోచనలను ప్రశాంతంగా తీసుకోవడం, ప్రతి పరిస్థితిని సమర్ధంగా హాండిల్ చేయడం మేధావులకు ముఖ్య లక్షణం. ఎలాంటి కష్టాలు వచ్చినా తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలగా పనిచేయడం, సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం తెలివైన వ్యక్తుల లక్షణంగా చెప్పబడింది.
మేధావుల మరో ప్రధాన లక్షణం ఏదైనా లక్ష్యం నిశ్చయించుకున్నప్పుడు దాని పట్ల అంకితభావంతో పనిచేయడం. ఏవైనా అవాంతరాలు వచ్చినా దృష్టి మరలకుండా కృషి చేస్తారు. జీవితంలో దోహదపడే నిర్ణయాలు తీసుకోవడం, ప్రతీ పనిలో ప్రాధాన్యతలు గుర్తించడం, ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆపకుండా ప్రయత్నించడం వారికి ఉన్న ప్రత్యేకత.
చాణక్యుడి ప్రకారం మాటలు చాలా శక్తివంతమైనవి. ఒక వ్యక్తి తన మాటలతో ఇతరులను ఆకట్టుకోవడం, అవగాహన కలిగించడం ఎంతో ముఖ్యమైన లక్షణం. స్ఫష్టతతో మాట్లాడే నైపుణ్యం ఉన్నవారు ఇతరులను ప్రభావితం చేయడంలో ముందుంటారు. చాణక్యుడు చెప్పినట్లు వ్యక్తి మాటలతోనే తన తెలివితేటలను సరిగా వ్యక్తపరచగలిగితే అతను సఫలీకృతుడవుతాడు.
చాణక్యుడి ఆలోచనల్లో ముఖ్యమైన అంశం. తెలివైనవారు ఎప్పుడూ తమ తప్పుల నుంచి నేర్చుకోవడం. తాము చేసిన తప్పులనేగాక, ఇతరుల అనుభవాలనూ పరిగణనలోకి తీసుకుని ముందడుగు వేయడం మేధావులకు ఉండే మరో ముఖ్య లక్షణం. ఇతరుల తప్పులను పరిశీలించి ఆ తప్పులు తన జీవితంలో పునరావృతం కాకుండా చూసుకోవడం తెలివితేటలు ఉన్నవారు చేస్తారు. ఈ లక్షణాలు ఉన్న వారు మేధావులుగా పరిగణించబడతారని చాణక్యుడు పేర్కొన్నారు.