బట్టల విషయానికి వస్తే ఒక్కోసారి మరకలు పడటం సహజమే. అది ఎలాంటి డ్రింక్ అయినా, ఆహారం అయినా, సిరా గుర్తు అయినా.. పడిన మరకలను తొలగించడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది. అయితే, ప్రస్తుత రోజుల్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీ, రసాయనాలతో వివిధ రకాల ఫాబ్రిక్ మరకలను ఈజీగా తొలగించుకోవడంతో పాటు దస్తులను శుభ్రంగా, తాజాగా ఉంచుకోవచ్చు.
ఆహారపు మరకలు: దుస్తులపై ఆహారపు మరకలు పడితే వాటిని కొన్ని ఈజీ టిప్స్‌తో తొలగించుకోవచ్చు. చల్లటి నీటితో తడిసిన ప్రదేశాన్ని సున్నితంగా రఫ్ చేయడం ద్వారా ఈ మరకలను ఈజీగా తొలగించొచ్చు. కొద్ది మొత్తంలో డిష్‌వాషింగ్ లిక్విడ్, లాండ్రీ డిటర్జెంట్‌ను అప్లై చేయాలి. ఆపై యధావిధిగా వాటిని పిండాలి. దాంతో ఆహారపు మరకలు ఈజీగా తొలగిపోతాయి.
టీ, కూల్ డ్రింక్స్ మరకలు: కాఫీ, టీ, జ్యూస్ మరకలు కొంచెం ఇబ్బంది కరంగా ఉంటాయి. ముందుగా చల్లటి నీటితో మరకను కడిగి, ఆ తరువాత వైట్ వెనిగర్, ప్రత్యేక స్టెయిన్ రిమూవర్ మిశ్రమాన్ని అప్లై చేయడం ద్వారా ఈ మరకలను తొలగించొచ్చు.
గ్రీజు/నూనె మరకలు: నూనెను పీల్చుకోవడానికి టాల్కమ్ పౌడర్, కార్న్‌స్టార్చ్, బేకింగ్ సోడా వంటి శోషన గుణాలున్న పదార్థాలను మరకపై వేయాలి. కొన్ని నిమిషాల తర్వాత బ్రష్‌తో మరకపై రుద్దాలి. ఆ తరువాత స్టెయిన్‌కు అప్లై చేయాలి. లాండరింగ్ చేయడానికి ముందు కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి.
ఇంక్ మరకలు: ఏదైనా సిరా మరకలను తొలగించడానికి ముందుగా దానిని నీటితో కడగాలి. ఆ తరువాత రుబ్బింగ్ ఆల్కహాల్, ఇంక్ స్టెయిన్ రిమూవర్‌ని అప్లై చేసి ఉతకాలి. ఇలా త్వరగా ఇంక్ మరకలు తొలగిపోతాయి.
రక్తపు మరకలు: రక్తపు మరకలను తొలగించడానికి ముందుగా చల్లటి నీటితో కడగాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా చల్లని నీరు, ఉప్పు మిశ్రమంతో బ్రష్ చేయాలి. ఆ తరువాత చల్లని నీటిలో ఫాబ్రిక్ ఉతకాలి.
దుస్తులపై మరకలు పోవాలంటే.. వీలైనంత త్వరగా మరకలను కడగడం, వేడి నీటిని ఉపయోగించకుండా ఉండటం ముఖ్యం. ఇలా చేయడం వలన మరక త్వరగా తొలగిపోతుంది. వివిధ రకాల ఫాబ్రిక్ మరకలను తొలగించడం ద్వారా దుస్తులను ఉత్తమంగా చూసుకోవడంతో పాటు.. వాటి జీవిత కాలాన్ని పెంచొచ్చు.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..