Lemon Chicken: బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ రెసిపీ.. ఈ లెమన్ చికెన్ ఓసారి ట్రై చేయండి..

కేటో డైట్ అంటే రుచికరమైన ఆహారం దూరం అనుకుంటారు చాలా మంది. కానీ అది నిజం కాదు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ రుచి ఉండే వంటకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ లెమన్ చికెన్ రెసిపీ. ఈ వంటకం తక్కువ సమయంలో, సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి పెద్దగా శ్రమ అవసరం లేదు.

Lemon Chicken: బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ రెసిపీ.. ఈ లెమన్ చికెన్ ఓసారి ట్రై చేయండి..
Quick And Easy Keto Lemon Chicken

Updated on: Aug 23, 2025 | 10:19 PM

కావాల్సిన పదార్థాలు:

చికెన్: 200 గ్రాములు

హంగ్ కర్డ్ (పెరుగు): 1 కప్పు

ఉప్పు: తగినంత

కొత్తిమీర ఆకులు: 1 గుప్పెడు

వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్

నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు

నల్ల మిరియాల పొడి: తగినంత

స్పైస్ పాప్రికా: 2 టీ స్పూన్లు

మసాలాలు: 1 టేబుల్ స్పూన్

వెన్న (బటర్): 1 టేబుల్ స్పూన్

 

ఈ వంటకం కోసం మొదట చికెన్ శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో నిమ్మరసం, పెరుగు, తగినంత ఉప్పు, మిరియాల పొడి, పాప్రికా వేసి కలపాలి. చికెన్ ముక్కలను గుచ్చి ఆ మిశ్రమంలో బాగా ముంచాలి. కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచి మ్యారినేట్ చేయాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేడి చేయాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. మిగిలిన మసాలా దినుసులు, మిశ్రమ సుగంధాలు వేసి మూత పెట్టాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత మంట తగ్గించి నిమ్మకాయ ముక్కలు, కొత్తిమీర వేసి దించాలి. వేడివేడిగా వడ్డించుకుంటే సరి.

చికెన్ వంటకాలు సులభం, ఆరోగ్యం కూడా. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి.