Fish: ఆ చేపలతో అందం కూడా సొంతం.. వారంలో ఒక్కరోజు తిన్నా చాలు..

|

Oct 03, 2024 | 3:00 PM

చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకోవడంలో గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే సాల్మన్‌ చేపలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు...

Fish: ఆ చేపలతో అందం కూడా సొంతం.. వారంలో ఒక్కరోజు తిన్నా చాలు..
Salon Fish
Follow us on

చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకోవడంలో గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే సాల్మన్‌ చేపలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వారంలో ఒక్క రోజు ఈ చేపలను తిన్నా సరే చర్మ సమస్యలన్నీ బలదూర్‌ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సాల్మన్ చేపలను తీసుకోవడం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వయసుతో పాటు వచ్చే చర్మం ముడతల సమస్యకు సాల్మన్‌ చేపలు బాగా ఉపయోగపడాతాయి. ఇది చర్మానికి కావాల్సి ఆర్థ్రీకరణ పెంచడంలో తోడ్పడుతుంది. ఇక సాల్మన్‌ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం మృదువుగా మారడంలో కూడా సాల్మన్‌ చేపలు ఉపయోగపడతాయి. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మం తేమను కాపాడడంలో ఉపయోగపడతాయి. చర్మాన్ని డ్రై కాకుండా కాపడుతుంది. తేమను లాక్‌ చేస్తుంది.

సాల్మన్‌ చేపలను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల మొటిమలు కంట్రోల్‌ అవుతాయి. అలాగే వీటివల్ల
కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. సాల్మన్‌ చేపల్లో విటమిన్‌ డీ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. స్కిన్‌ హీలింగ్‌గా ఉపయోగపడి, మచ్చలు తగ్గేలా చేస్తాయి. కాబట్టి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా సాల్మన్‌ చేపలను తీసుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..