Health: ఆ ట్యాబ్లెట్స్‌ ఎక్కువగా వాడుతున్నారా.? అల్సర్‌ రావడం ఖాయం..

ఒక్కసారి అల్సర్‌ వస్తే జీవితాంతం ఆ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇక అల్సర్‌ రావడానికి ఆహారంలో పాటు ఒత్తిడి, ఆందోళన, స్మోకింగ్, ఆల్కహాల్‌ సేవించడం వంటివి కూడా కారణమవుతుయాని నిపుణులు చెబుతుంటారు. వీటివల్ల వల్ల పొట్టలోని మ్యూకోజ్‌ పొరకు చిరుగులు ఏర్పడి...

Health: ఆ ట్యాబ్లెట్స్‌ ఎక్కువగా వాడుతున్నారా.? అల్సర్‌ రావడం ఖాయం..
Ulcer

Updated on: Jul 25, 2024 | 11:48 AM

ప్రస్తుతం చాలా మంది అల్సర్‌ సమస్యతో బాధపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఈ సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. గాడి తప్పిన ఆహారపు అలవాట్ల కారణంగా జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిసిందే. అలాగే ఫ్రైలు, మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా అల్సర్‌ సమస్య ఎక్కువవుతుందని నిపుణులు చెబుతుంటారు.

ఒక్కసారి అల్సర్‌ వస్తే జీవితాంతం ఆ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇక అల్సర్‌ రావడానికి ఆహారంలో పాటు ఒత్తిడి, ఆందోళన, స్మోకింగ్, ఆల్కహాల్‌ సేవించడం వంటివి కూడా కారణమవుతుయాని నిపుణులు చెబుతుంటారు. వీటివల్ల వల్ల పొట్టలోని మ్యూకోజ్‌ పొరకు చిరుగులు ఏర్పడి అల్సర్లకు దారి తీస్తుందని చెబుతుంటారు. అయితే అల్సర్‌కు మరో కారణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

జీర్ణాశయంలో పుండ్లకు పెయిన్‌ కిల్లర్స్‌ కూడా కారణమవుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం వంటి మందులను ఎక్కువ కాలంపాటు తీసుకోవడం వల్ల కూడా అల్సర్‌ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటి పెద్ద మొత్తంలో తీసుకుంటే.. జీర్ణకోశం దెబ్బతింటుందని పరిశోధనల్లో వెల్లడైంది. కీళ్లనొప్పులు తగ్గటానికి ఇలాంటి రకం మాత్రలను కనీసం 6 నెలల పాటు వాడినవారిలో 68% మందిలో జీర్ణకోశం దెబ్బతిన్నట్టు, 15% మందికి పుండు పడినట్టు అధ్యయనాల్లో వెల్లడయ్యాయి.

కాబట్టి ఇలాంటి మాత్రలను ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకు వాటి వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అల్సర్స్‌కు హెలికోబ్యాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ కూడా కారణమవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లిన తర్వాత వాపుకారక కణాలను విడుదల చేస్తాయని చెబుతున్నారు. ఇవి జీర్ణకోశ వ్యవస్థ గోడలకు అంటుకొని దెబ్బతీస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..