Relationship Tips: భార్య లేదా ప్రేమికురాలు అల్ప సంతోషి.. తన జీవిత భాగస్వామి నుంచి డబ్బుకంటే వీటిని ఎక్కువగా కోరుకుంటుందని తెలుసా..

రిలేషన్ షిప్ పని జీవిత కాలం కొనసాగాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే సరిపోదు..ఆ సంబంధాన్ని దీర్ఘకాలికంగా నిలబెట్టుకోవడానికి ఎల్లప్పుడూ దృఢంగా ఉంచుకోవడానికి అనేక ఒడిదుడుకులను అధిగమించాలి. ఈ సమయంలో భాగస్వాములు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరికి సంబంధించిన విషయాలను ఒకరు తెలుసుకోవడం అర్థం చేసుకోవడం చెయ్యాలి. అటువంటి పరిస్థితిలో ఎవరినైనా ప్రేమించినా లేదా వివాహం చేసుకున్నా .. ఆడవారు తమ భాగస్వామి నుంచి కొన్ని విషయాలను ఆశిస్తారు. అవి ఏమిటో తెలుసుకుందాం..

Relationship Tips: భార్య లేదా ప్రేమికురాలు అల్ప సంతోషి.. తన జీవిత భాగస్వామి నుంచి డబ్బుకంటే వీటిని ఎక్కువగా కోరుకుంటుందని తెలుసా..
Relationship TipsImage Credit source: kupicoo/E+/Getty Images
Follow us

|

Updated on: Sep 10, 2024 | 11:36 AM

భార్యాభర్తల సంబంధమైనా లేదా ప్రేమికుల మధ్య ప్రేమే కాకుండా, దీర్ఘకాలిక సంబంధానికి అనేక ఇతర అంశాలు కూడా ముఖ్యమైనవి. ఈ రోజుల్లో ఆడవారికి విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వడం ద్వారా సంతోషంగా ఉంచవచ్చు అని చాలా మంది మగవాళ్ళు స్త్రీల గురించి ఆలోచిస్తున్నారు. అయితే పరిస్థితులు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒక స్త్రీ తన జీవిత భాగస్వామి నుంచి లేదా ప్రేమికుడి నుండి డబ్బును ఆశించదు. అయితే ఆమె తన భాగస్వామి నుంచి డబ్బు కంటే ఇంకా చాలా ఎక్కువ ఆశిస్తుంది. పురుషుడు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటే.. వారి సంబంధం చాలా కాలం పాటు బలంగా ఉంటుంది.

రిలేషన్ షిప్ పని జీవిత కాలం కొనసాగాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే సరిపోదు..ఆ సంబంధాన్ని దీర్ఘకాలికంగా నిలబెట్టుకోవడానికి ఎల్లప్పుడూ దృఢంగా ఉంచుకోవడానికి అనేక ఒడిదుడుకులను అధిగమించాలి. ఈ సమయంలో భాగస్వాములు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరికి సంబంధించిన విషయాలను ఒకరు తెలుసుకోవడం అర్థం చేసుకోవడం చెయ్యాలి. అటువంటి పరిస్థితిలో ఎవరినైనా ప్రేమించినా లేదా వివాహం చేసుకున్నా .. ఆడవారు తమ భాగస్వామి నుంచి కొన్ని విషయాలను ఆశిస్తారు. అవి ఏమిటో తెలుసుకుందాం..

ప్రేమ తర్వాత అతి ముఖ్యమైన విషయం

సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం.. దానిని బలంగా ఉంచడానికి గౌరవం చాలా ముఖ్యమైన విషయం. ప్రతి భార్య లేదా ప్రేమికురాలు తన భాగస్వామి తమకు గౌరవం ఇవ్వాలని ఆశిస్తారు. ఇందులో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు. అదే సముయంలో తమ భాగస్వామికి సంబంధించిన చాలా చిన్న విషయాలను గుర్తుంచుకోవాలి. ఇతరుల ముందు మీ భాగస్వామితో బిగ్గరగా లేదా కోపంగా మాట్లాడకండి.

ఇవి కూడా చదవండి

భాగస్వామి నుంచి మానసిక మద్దతు

స్త్రీలు తమ భాగస్వాముల నుండి భావోద్వేగ మద్దతును ఆశిస్తారు. రోజువారీ సంభాషణలు, సంతోషం, బాధలను తమ భాగస్వామితో పంచుకోవడం ఇష్టపడతారు. సరళంగా చెప్పాలంటే, మహిళలు తమ భాగస్వామిలో స్నేహితుడిని కోరుకుంటారు. అందుకనే తమ జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని బహిరంగంగా పంచుకుంటారు. అదే సమయంలో తమ భర్తకు లేదా, ప్రియుడి ఏదైనా అవసరం అయితే వారికి తమ మద్దతు ఇస్తారు. తనకు కూడా మానసికంగా మద్దతుగా నిలవాలని కోరుకుంటారు.

భాగస్వామికి సమయం ఇవ్వాలి

అమ్మాయిలు తమ భాగస్వామి తమతో గడపడానికి సమయాన్ని కేటాయించాలని కోరుకుంటారు. అంటే భార్యను లేదా ప్రియురాలిని ఖరీదైన ప్రదేశాలకు తీసుకెళ్లాలని దీని అర్థం కాదు. ఆమెతో కలిసి మాట్లాడే సమయం ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంది. లాంగ్ డ్రైవ్‌కు తీసుకుని వెళ్తే ఇష్టపడుతుంది. చిన్న చిన్న విషయాలకే సంతోషపడే అల్ప సంతోషి.. పానీపూరీ, లేదా ఐస్ క్రీం కలిపి తినడం వంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆడవారిని ఎంతో సంతోషపెడతాయి.

భాగస్వామి నుంచి మద్దతు కోరుకుంటారు

పురుషుల మాదిరిగానే.. చాలా మంది మహిళలు కూడా పని చేస్తున్నారు. తమ కెరీర్ లో ముందుకు సాగడానికి తమ భాగస్వామి తమకు మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నారు. చాలా సార్లు ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న తర్వత భార్య ఉద్యోగం చేయడం భర్తకు ఇష్టం లేదని తమ కలలను, ఉద్యోగాలను వదిలి వేస్తున్న స్త్రీలు కనిపిస్తూనే ఉన్నారు. మహిళలు ముందుకు సాగడానికి మద్దతిచ్చే పురుషులలో మీరు ఒకరైతే.. మీ సంబంధం గొప్పగా ఉంటుంది.

ఇంటి బాధ్యతలను పంచుకోండి

స్త్రీ ఇంటి పనుల నుండి ఎప్పుడూ విశ్రాంతి తీసుకోవాలని కోరుకోదు. ఆమె బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తున్నా సరే ఇంట్లో భాద్యతలు ఎక్కువగానే ఉంటాయి. అటువంటి పరిస్థితిలో స్త్రీలు తమ భాగస్వామి ఇంటి బాధ్యతలలో కనీస సాయం చేయాలనీ కోరుకుంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..