పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇది ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది.
డయాబెటిస్ దరిచేరకుండా ఉండాలంటే రోజూ దాల్చిన చెక్కను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది టైప్2 డయాబెటిస్ ఉన్న వారిలో కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది.
రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడ వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రక్తపోటు, కొలస్ట్రాయల్ స్థాయిలను తగ్గిస్తుంది.
లవంగాలు సైతం డయాబెటిస్ రోగులకు వరంలా చెప్పొచ్చు. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంతో పాటు, రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
డయాబెటిస్‌తో బాధపడేవారు కచ్చితంగా గుమ్మడి లేదా పుచ్చకాయ విత్తనాలను ఆహౄరంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
సోయా లేదా గోధుమతో తయారయ్యే ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ షుగర్ పేషెంట్స్‌కి మేలు చేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.