09 September 2024
TV9 Telugu
Pic credit - Pexels
గుడ్డు సంపూర్ణ ఆహారం. మాంసకృత్తులు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి, గుడ్డులోని పసుపు భాగం అంటే పచ్చసొనలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇది కొంతమందికి హానికరం.
ఎ, బి6, బి12, డి, ఇ , కె విటమిన్లు మాత్రమే కాదు గుడ్డు పచ్చసొనలో ఒమేగా 3, ఫోలేట్, జింక్, ఐరన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి.
గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలను కలిగి ఉంటుందిత. అయితే దీనిలో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది. దీని కారణంగా కొన్ని పరిస్థితులలో గుడ్డు పచ్చసొన తినడం ఆరోగ్యానికి మంచిది కాదు
ఎవరైనా సరే అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ గుడ్లు తినొద్దు. ఒకవేళ గుడ్డు తింటే గుడ్డులోని పచ్చ సోన తినకుండా ఉండాలి. లేకపోతే సమస్య పెరుగుతుంది.
అధిక బరువు ఉన్నవారు, ప్రోటీన్ కోసం తినే ఆహారంలో గుడ్డును చేర్చుకుంటారు. అప్పుడు గుడ్డులోని పసుపు భాగాన్ని తినొద్దు. లేకపోతే కొవ్వు మరింత పెరగవచ్చు.
మధుమేహం ఉన్నవారు గుండె జబ్బులు, బరువు పెరగడం, తగ్గడం వంటి సమస్యలను కలిగి ఉంటారు. అలాంటి సందర్భాలలో గుడ్డులోని పసుపు భాగాన్ని తినొద్దు
ఆహారం జీర్ణం కావడం కష్టంగా ఉన్నవారు కోడిగుడ్డు పచ్చసొన తినకూడదు. లేకుంటే విరేచనాలు కావచ్చు.