ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌‎ను ఎలా వండుకోవాలి?

10 September 2024

Battula Prudvi 

ఎంత సమయం ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌‎ను ఉడికించాలి? అనే విషయం ఆ ప్యాకెట్‌ లేబుల్‌పై స్పష్టంగా రాసి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వాలి.

గది ఉష్ణోగ్రత వద్దకు తీసుకురావాలా? లేదంటే అలాగే వండుకోవాలా అనే విషయాన్నీ లేబుల్‌పై ఓసారి పరిశీలించడం ముఖ్యం.

లేదంటే ఆహారం విషతుల్యమయ్యే ప్రమాదం ఉంటుంది. వండుకునే ముందు ఒవెన్‌లో వీటిని కొన్ని నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది.

ప్రస్తుతం ఇందుకోసం డీఫ్రాస్టింగ్‌ సెట్టింగ్‌ చేసుకునే అవకాశం ఉన్న ఒవెన్స్‌ కూడా దొరుకుతున్నాయి. వాటిలో పెడితే సరి!

శీతలీకరించిన కాయగూరలు గడ్డకట్టినట్లుగా ఉంటాయి. ఎందుకంటే వీటిని ముందు వేడి నీటిలో కాసేపు ఉంచి.. ఆపై శీతలీకరిస్తారట! తద్వారా అవి కాస్త ఉడికిపోయి ఉంటాయి

సాధారణ కాయగూరల్లాగే ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌తో రోస్టింగ్‌, స్టీమింగ్‌, సాటింగ్‌, తక్కువ నూనెతో వంట చేయడం వంటివి చేసుకోవచ్చు

వండుకోగా మిగిలిన ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ని ముందు గది ఉష్ణోగ్రత వద్దకు తీసుకొచ్చి.. ఆపై గాలి చొరబడని బ్యాగ్‌ లేదా డబ్బాలో పెట్టి ఫ్రీజర్‌లో నిల్వ చేయాలి.

ఇదిలా ఉంటె ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నారు పోషికాహార నిపుణులు.