Loose Motions: లూజ్ మోషన్స్ సమస్యా.. ఈ ఇంటి చిట్కాలతో టక్కున తగ్గుతాయి..

వర్షాకాలంలో చాలా మంది ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో లూజ్ మోషన్స్ కూడా ఒకటి. వీటినే నీళ్ల విరేచనాలు అని కూడా అంటారు. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారగానే చాలా మందిలో అనేక సమస్యలు తలెత్తుతాయి. తేమ కారణంగా బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు ఎక్కువగా ఉంటాయి. వీటితోనే అనేక రకాల వ్యాధులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్, నిల్వ ఉంచిన ఆహారం తిన్నా, బయట ఆహారం తిన్నా, పడని ఆహారం తిన్నా..

Loose Motions: లూజ్ మోషన్స్ సమస్యా.. ఈ ఇంటి చిట్కాలతో టక్కున తగ్గుతాయి..
Loose Motions

Updated on: Jul 13, 2024 | 3:07 PM

వర్షాకాలంలో చాలా మంది ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో లూజ్ మోషన్స్ కూడా ఒకటి. వీటినే నీళ్ల విరేచనాలు అని కూడా అంటారు. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారగానే చాలా మందిలో అనేక సమస్యలు తలెత్తుతాయి. తేమ కారణంగా బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు ఎక్కువగా ఉంటాయి. వీటితోనే అనేక రకాల వ్యాధులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్, నిల్వ ఉంచిన ఆహారం తిన్నా, బయట ఆహారం తిన్నా, పడని ఆహారం తిన్నా.. నీళ్ల విరేచనాలు అవుతాయి. నీళ్ల విరేచనాల కారణంగా నీరసంగా అనిపిస్తుంది. కొంత మంది అయితే కళ్లు తిరిగి పడిపోతూ ఉంటారు. నీళ్ల విరేచనాలను ఇంటి చిట్కాలతో కూడా తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

నిమ్మకాయ నీళ్లు:

నీళ్ల విరేచనాలు అవ్వడం వల్ల బాడీలోని ఎలక్ట్రోలైట్స్‌ని కోల్పోతాము. దీని వల్ల డీహైడ్రేషన్‌కి గురవడం, నీరసంగా ఉంటారు. వీటిని తిరిగి పొందాలంటే నిమ్మకాయ నీళ్లు సహాయ పడతాయి. ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయ చెక్క పిండి.. అందులో కొద్దిగా ఉప్పు, చక్కెర కలిపి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల బాడీ కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి పొందవచ్చు. అంతే కాకుండా నీరసం కూడా తగ్గుతుంది.

అరటి పండు:

నీళ్ల విరేచనాలను తగ్గించడంలో అరటి పండు కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. అరటి పండు తినడం వల్ల శక్తి కూడా వస్తుంది. విరేచనాలు కూడా సులభంగా తగ్గిపోతాయి. అరటి పండులో ఉండే కార్బోహైడ్రేట్లు విరేచనాలకు అడ్డుకట్ట వేస్తాయి. అయితే అరటి పండు మరీ పండుది తినకూడదు.

ఇవి కూడా చదవండి

నారింజ – ద్రాక్ష:

నారింజ, ద్రాక్ష తినడం వల్ల కూడా నీళ్ల విరేచనాలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వీటిని తినడం వల్ల పోయిన శక్తి వస్తుంది. మోషన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

పెరుగు:

నీళ్ల విరేచనాలను కట్టడి చేయడంలో పెరుగు కూడా హెల్ప్ చేస్తుంది. పెరుగులో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థలోని చెడు బ్యాక్టీరియాను తగ్గించి.. మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. కాబట్టి పెరుగు తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..