Lifestyle: కళ్లలో దురద, మంటగా ఉంటోందా.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
దుమ్ము, బాక్టీరియా, అలెర్జీలు, కాంటాక్ట్ లెన్స్‌లు వంటి కళ్లలో చికాకు, దురదకు కారణాలుగా చెప్పొచ్చు. కళ్లు ఎర్రబడటానికి ప్రధాన కారణాలలో ఒకటి అలెర్జీ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది కళ్లలో మంట, దురదను కలిగిస్తుంది. దుమ్ము, పొగాకు వంటివి కూడా కళ్లు ఎర్రగా మారడానికి కారణాలుగా చెబుతున్నారు.
గంటలతరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, స్మార్ట్ ఫోన్‌లతో కుస్తీ పట్టడం కారణం ఏదైనా ఇటీవల చాలా మంది కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య సర్వసాధారణంగా మారింది, కానీ చాలా మంది దీనిని తేలికగా తీసుకుంటారు. దీంతో దీర్ఘకాలంలో కంటి సంబంధిత సమస్యలు తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ళలో మంట, దురద వెనుక అనేక కారణాలు ఉంటాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం. లేదంటే కంటి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇంతకీ కళ్లలో కనిపించే ఈ లక్షణాలు దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..
దుమ్ము, బాక్టీరియా, అలెర్జీలు, కాంటాక్ట్ లెన్స్‌లు వంటి కళ్లలో చికాకు, దురదకు కారణాలుగా చెప్పొచ్చు. కళ్లు ఎర్రబడటానికి ప్రధాన కారణాలలో ఒకటి అలెర్జీ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది కళ్లలో మంట, దురదను కలిగిస్తుంది. దుమ్ము, పొగాకు వంటివి కూడా కళ్లు ఎర్రగా మారడానికి కారణాలుగా చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక రాత్రుళ్లు ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్‌లు వాడడం కూడా కళ్ల సమస్యకు కారణమని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది.
వీటివల్ల కళ్లు పొడిబారుతాయని, ఇది కంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. కాలక్రమేణా ఇది కంటి చూపు కోల్పోవడానికి కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే వీలైనంత వరకు స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలని చెబుతున్నారు. ఐ ప్రొటెక్షన్ కోసం కళ్ల జోడ్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే కళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువసేపు కళ్లలో మంట, దురద ఉంటే చల్లటి నీటితో కడుక్కోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. సూర్యకాంతి, ధూళి కళ్లపై పడకుండా చూసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..