
మన ఇళ్లల్లో సాధారణంగా లభించే వెల్లుల్లి కేవలం వంటకు రుచిని అందించే పదార్థం మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక అద్భుత ఔషధం. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులను గమనించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, వెల్లుల్లి అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఈ కథనంలో, వెల్లుల్లిని తినే సరైన పద్ధతి, దాని ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
వెల్లుల్లిని దంచినప్పుడు లేదా చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు, దాని నుండి అలసిన్ అనే శక్తివంతమైన కాంపౌండ్ విడుదల అవుతుంది. ఈ అలసిన్ సహజమైన యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో జలుబు, దగ్గు, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అలసిన్ రక్తంలోకి చేరినప్పుడు, బ్లాక్ అయిన రక్తనాళాలను తెరిచి రక్త ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలోని భయంకరమైన ఇన్ఫెక్షన్లను కూడా నాశనం చేస్తుంది. ఫలితంగా, రోగనిరోధక శక్తి బలపడి, శరీరం రోజంతా శక్తివంతంగా, చురుకుగా ఉంటుంది.
ఉదయాన్నే నిద్ర లేవగానే, ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయండి లేదా కచ్చాపచ్చాగా దంచండి. దానిని నోట్లో పెట్టుకుని నములుతూ మింగేయాలి. లేకపోతే వెల్లుల్లి పొట్టు తీసి.. అలానే నమిలి తినాలి. అనంతరం వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగాలి. వెల్లుల్లి వాసన లేదా రుచి నచ్చని వారు దంచిన వెల్లుల్లిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగవచ్చు. వెల్లుల్లి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి.. గోరువెచ్చని నీరు ఆ వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంపొందించడం: వెల్లుల్లిలోని అలసిన్ శరీరంలోని రోగాలతో పోరాడే శక్తిని రెట్టింపు చేస్తుంది. తరచుగా గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
జీర్ణక్రియ మెరుగుదల: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవడం వల్ల కడుపులోని ఎంజైమ్‌లు ఉత్తేజపడి, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
రక్తపోటు నియంత్రణ: వెల్లుల్లిలోని సల్ఫర్ కాంపౌండ్స్ రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఆధునిక సైన్స్ కూడా దీనిని ధృవీకరించింది.
గుండె ఆరోగ్యం: వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గిస్తుంది. ధమనులలో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. హార్ట్ పేషెంట్స్‌కు ఇది ఒక సహజ ఆయుర్వేద ఔషధం.
రక్త శుద్ధి, చర్మ సౌందర్యం: వెల్లుల్లి ఒక శక్తివంతమైన రక్త శుద్ధి చేసే ఏజెంట్. శరీరం నుండి విష పదార్థాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరుస్తుంది. దీనివల్ల మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు తగ్గి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
ఇన్ఫెక్షన్ల నివారణ: అలసిన్ యాంటీబయాటిక్ లక్షణాలు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వల్ల కలిగే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి.
బరువు తగ్గడం: వెల్లుల్లి శరీరంలో మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఇది కాలేయంలోని కొవ్వును కరిగించి, నెమ్మదిగా పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు దీనిని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి లేదా వైద్యుల సలహా తీసుకోవాలి:
రోజుకు కేవలం ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బ మాత్రమే సరిపోతుంది. రెండు నుండి మూడు రెబ్బలు తింటే కడుపులో మంట వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ రెబ్బ అంటే వెల్లుల్లిపాయలోని ఒక పాయ మాత్రమే, మొత్తం వెల్లుల్లి కాయ కాదు.
ఈ విధంగా మూడు నుండి నాలుగు వారాల పాటు క్రమం తప్పకుండా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుంటూ ఉంటే, మీ శరీరంలో జరిగే సానుకూల మార్పులను మీరే గమనించవచ్చు. చిన్నగా కనిపించే ఈ వెల్లుల్లిని నిజంగా దేవుడు మనకు ప్రసాదించిన ఒక సహజ వరం అని చెప్పవచ్చు. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..