Rainy Season Diet: వర్షాకాలంలో ఈ సమస్యలున్నవారు ఎక్కువగా మాంసాహారం తినొద్దు.. ఎందుకంటే..

వర్షాకాలంలో శరీరం వెచ్చగా ఉండడానికి.. ఆరోగ్యంగా ఉండటానికి వేడి వేడి సూప్ లతో పాటు మొక్క జొన్న , పకోడీ బజ్జీలు వంటి ఆహారపదార్ధాలను తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అంతేకాదు మాంసాహారం ప్రియులు ఐతే ఈ సీజన్ లో చికెన్ మటన్ లతో పాటు సీఫుడ్ ని కూడా అధిక మొత్తంలో తినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇవి ఆరోగ్యానికి మేలు కలిగించే ఆహారమే.. అయినా సరే వర్షాకాలంలో మాంసాహారం తింటే ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే

Rainy Season Diet: వర్షాకాలంలో ఈ సమస్యలున్నవారు ఎక్కువగా మాంసాహారం తినొద్దు.. ఎందుకంటే..
Rainy Season Diet

Updated on: Jun 24, 2025 | 3:55 PM

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం మాత్రమే కాదు శరీరం వెచ్చగా ఉంచేందుకు తినే ఆహారాన్ని ఎంచుకుంటారు. శరీరానికి వెచ్చదనాన్ని అందించే వేడి వేడి సూప్ లు, రోగనిరోధక శక్తిని పెంచే సీజనల్ పండ్లు, వెల్లుల్లి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. అయితే వర్షాకాలంలో ఎంత ఇష్టమైనా సరే మాంసాహరానికి.. పుట్టగొడుగులు, సముద్రపు ఆహారం, వీధుల్లో అమ్మే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అంతేకాదు వేయించిన, మసాలా అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మేలు. ఈ రోజు వర్షాకాలంలో ఎక్కువగా మాంసం తినకూడదు! ఎందుకో తెలుసుకుందాం..

  1. వర్షాకాలంలో మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
  2. వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. అలాంటి సమయాల్లో మాంసం తినడం వల్ల అసిడిటీ, మలబద్ధకం సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మాంసం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.
  3. వర్షాకాలంలో కలుషిత నీటి కారణంగా మాంసాహారం త్వరగా చెడిపోతుంది. చాలా సార్లు మాంసం అమ్మే దుకాణాలలో నిల్వ చేసిన మాంసం దొరుకుతుంది. ఇలాంటి మాంసం తెచ్చుకుని వంట చేసుకుంటుంటే.. అది సరిగ్గా ఉడక పోతే అది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది.
  4. రోగనిరోధక శక్తి ఇప్పటికే బలహీనంగా ఉన్నవారు లేదా గుండె జబ్బుతో బాధపడుతున్నవారు వర్షాకాలంలో పొరపాటున కూడా మాంసాహారం తీసుకోకూడదు.
  5. ఇవి కూడా చదవండి
  6. కొన్నిసార్లు చేపలను కలుషిత నీటిలో ఉంచి నిల్వ చేస్తారు. ఇలా చేయడం వలన చేపలకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వాటిని తింటే ఆరోగ్యానికి హానికరం.
  7. ఇటీవలి కాలంలో కోళ్లలో బర్డ్ ఫ్లూ ప్రమాదం కూడా పెరిగింది. అందువల్ల గుడ్లు, కోడి మాంసం తినకూడదు.

మాంసాహారం తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు

  1. అధిక ప్రోటీన్ మూలం.
  2. కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.
  3. పోషకాలను కలిగి ఉంటుంది.
  4. సరైన మొత్తంలో కాల్షియం.

నాన్-వెజ్ తాజాగా ఉండాలి. బాగా శుభ్రం చేసిన తర్వాత తినాలి. ఇంటిలో వంట చేసుకోవడానికి బద్దకించి బయటి నుంచి నాన్-వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసినా లేదా తిన్నా.. ముందుగా ఆ ఆహారం శుభ్రతను తప్పకుండా తనిఖీ చేయండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)