
నేటి ఆధునిక యుగంలో, చాలా మంది చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు, తెల్ల జుట్టు వృద్ధులకు మాత్రమే వస్తుందని చెప్పేవారు . కానీ ఇప్పుడు ఇది 18 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులలో ఎక్కువగా కనిపిస్తుంది. జన్యుశాస్త్రం మాత్రమే కాకుండా, కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాల లోపం కూడా ఈ సమస్యలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, జీవనశైలి , ఆహారం, మానసిక ఒత్తిడి వంటి అంశాలు కూడా ఈ సమస్యకు దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
విటమిన్లు, తెల్ల జుట్టు మధ్య సంబంధం ఏమిటి?
జుట్టు రంగు అనేది మెలనిన్ అనే వర్ణద్రవ్యంపై ఆదారపడి ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం శరీరంలోని మెలనోసైట్ కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ కణాలకు తగినంత పోషకాహారం అందనప్పుడు లేదా వాటి పనితీరు బలహీనపడినప్పుడు, మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల జుట్టు సహజంగానే దాని రంగును కోల్పోయి తెల్లగా కనిపిస్తుంది. కొన్ని విటమిన్ల లోపం వల్ల జుట్టు అకాల బూడిద రంగులోకి మారుతుంది.
విటమిన్ బి12 లోపం
జుట్టు తెల్లబడడానికి విటమిన్ బి12 లోపం కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ రవాణాకు సహాయపడుతుంది. మన శరీరంలో ఈ విటమిన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు, జుట్టు కుదుళ్లకు తగినంత పోషకాహారం అందదు, అలాగే మెలనిన్ ఉత్పత్తి ప్రక్రియ నెమ్మదిస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, విటమిన్ బి12 లోపం శాఖాహారులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విటమిన్ ఎక్కువగా జంతు ఉత్పత్తులలో లభిస్తుంది. శాఖహారులు ఈ లోపాన్ని అధిగమించడానికి, గుడ్లు, పాలు, పుట్టగొడుగులు వంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ డి లోపం
విటమిన్ డి ఎముకలకు మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. దీని లోపం జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. మెలనిన్‌ను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత జనరేషన్ యువత ఎక్కువగా ఇంట్లోనే గడపడం కారణంగా వారికి సూర్యరశ్మి తగలదు. దీని కారణంగా వారు విటమిన్ డిని ఎక్కువగా పొందలేరు. ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్న పిల్లలలో జుట్టు అకాల బూడిద రంగులోకి మారే అవకాశం ఉంది. ఈ లోపాన్ని ఎదుర్కోవడానికి, ప్రతిరోజూ 15 నుండి 20 నిమిషాలు ఎండలో గడపడం ముఖ్యం. కొవ్వు చేపలు, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, తృణధాన్యాలు తినడం వల్ల కూడా ఈ సమస్యకు చెక్‌పెట్టవచ్చు.
దీన్ని ఎలా నివారించాలి?
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.