Pawanmuktasana: బెల్లీ ఫ్యాట్ , ఊబకాయం తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ యోగాసనాన్ని రోజూ చేస్తే అద్భుత ఫలితం

|

Mar 04, 2021 | 2:45 PM

మీరు మీ శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించుకోవాటానికి ఎంత డైట్ పాటించినా శరీరానికి తగిన శ్రమ కూడా అవసరం.. అప్పుడే కొవ్వు కరుగుతుంది. మనం ఫిట్ గా ఆరోగ్యంగా..

Pawanmuktasana: బెల్లీ ఫ్యాట్ , ఊబకాయం తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ యోగాసనాన్ని రోజూ చేస్తే అద్భుత ఫలితం
Follow us on

Pawanmuktasana: మీరు మీ శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించుకోవాటానికి ఎంత డైట్ పాటించినా శరీరానికి తగిన శ్రమ కూడా అవసరం.. అప్పుడే కొవ్వు కరుగుతుంది. మనం ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటారు. సో మీరు కొవ్వును కరిగించుకోవాలను కుంటున్నారా.. అయితే పవన ముక్తాసనం సాధన చెయ్యండి. ఇది యోగాలో ఒక విధమైన ఆసనం. పవనం అంటే గాలి. ముక్త అంటే తొలగించటం. పేగుల్లో పేరుకుపోయిన అపాన వాయువును తొలగిస్తుంది కాబట్టే దీనికి పవన ముక్తాసనం అని పేరు వచ్చింది. పవనముక్తాసనం అనే సంస్కృత పదం. వాస్తవానికి మూడు పదాల మిశ్రమం. ఇందులో పవన అంటే వాయు లేదా గాలి. ముక్త అంటే విడుదల లేదా విసర్జన. ఆసనం అంటే యోగాలో శరీర స్థితి. ఈ మూడు పదాల కలయికనే పవనముక్తాసనం అంటారు.

పవన ముక్తాసనం ఎలా వేయాలంటే ..:

నేలపై వెల్లకిలా పడుకోవాలి. ముందుగా కాళ్లు తిన్నగా చాచి.. మీ భుజాలు నేలపై విస్తారం పరచాలి. అరచేతులు నేల వైపు ఉండాలి. ఎడమకాలును తిన్నగానే ఉంచి, కుడి మోకాలును వంచి.. రెండు చేతులతో గట్టిగా పట్టుకొని పొట్ట దగ్గరకు తేవాలి. మోకాలితో పొట్టను అదమాలి. శ్వాసను వదులుతూ తలను పైకి లేపి చుబుకాన్ని మోకాలుకు తాకించాలి. శ్వాసను వదులుతూ కాలును తిరిగి యథాస్థితికి తేవాలి. రెండో కాలుతోనూ ఇలాగే చేయాలి. తర్వాత దశలో రెండు మోకాళ్ల చుట్టూ చేతులు వేసి పొట్టను అదమాలి. శ్వాసను వదులుతూ తలను పైకి లేపి చుబుకాన్ని మోకాళ్లకు తాకించాలి. శరీరాన్ని ముందుకూ వెనక్కూ.. అలాగే కుడివైపు, ఎడమవైపు 5-10 సార్లు ఊపాలి. దీంతో ఆసనం పూర్తవుతుంది. ఇలా మూడు, నాలుగు సార్లు చేయాలి. దీన్ని వేసేటప్పుడు దృష్టిని కడుపు మీద కేంద్రీకరించాలి.

ఈ యోగాసనంతో కలిగే ప్రయోజనాలు :

* అపాన వాయువు బయటకు వెళ్ళుతుంది.

* మలబద్ధకం తగ్గుతుంది. కడుపు శుద్ధి అవుతుంది.

* పొట్టలో కొవ్వు కరిగి ఊబకాయం తగ్గుతుంది.

* ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది.

* మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

రాత్రిపూట తిన్న ఆహారం జీర్ణమయ్యే క్రమంలో పుట్టుకొచ్చే వాయువు లోపల అలాగే ఉండిపోతుంది. పవన ముక్తాసనం వేస్తే ఇది బయటకు వెళ్లిపోతుంది. దీన్ని నిద్ర లేస్తూనే మంచం మీద ఉండే చేయొచ్చు. అయితే ఈ ఆసనాన్ని గర్భిణులు వేయకూడదు.

Also Read: Blueberries Benefits : బ్లూ బెర్రీలు ఎన్నో పోషకాలకు నిలయం.. దీని జ్యూస్ వృద్ధులకు ఓ వరం..

ఆనందంలో తేలిపోతున్న అందాల సింగర్.. తల్లికాబోతున్నానని తెలిపిన శ్రేయ ఘోషాల్