AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త కెరీర్ కోసం పాటించాల్సిన వాస్తు చిట్కాలు.. ఇవి పాటిస్తే సంపద, శ్రేయస్సు, సంతోషం మీ సొంతం..!

ఇంట్లో శాంతి, సౌభాగ్యం మెండుగా ఉండాలంటే వాస్తు శాస్త్రం కొన్ని ముఖ్యమైన సూచనలు అందిస్తుంది. ప్రత్యేకించి వివాహిత మహిళలు కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే.. వారి భర్త ఉద్యోగం, వ్యాపారాల్లో అభివృద్ధి సాధించి, సంపాదనలో స్థిరత చేకూరుతుందని విశ్వసించబడుతుంది. ఇప్పుడు అలాంటి ఉపయోగకరమైన వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.

భర్త కెరీర్ కోసం పాటించాల్సిన వాస్తు చిట్కాలు.. ఇవి పాటిస్తే సంపద, శ్రేయస్సు, సంతోషం మీ సొంతం..!
Vastu For Working Men
Prashanthi V
|

Updated on: Apr 16, 2025 | 6:46 PM

Share

ఇంట్లో భర్త పనిచేసే వర్క్ డెస్క్ లేదా వర్క్ స్పేస్ ఉత్తర దిక్కులో ఉండేలా చూడాలి. ఆ ప్రదేశాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. నీలం లేదా ఆకుపచ్చ రంగులు అక్కడ వాడితే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. డెస్క్‌పై లోహపు తాబేలు పెట్టడం వల్ల కెరీర్‌లో స్థిరత చేకూరుతుంది. అద్దాలు, అలజడి కలిగించే వస్తువులు అక్కడ ఉండకూడదు.

నగదు, ఆభరణాలు ఉంచే బీరువాను ఉత్తర దిక్కులో ఉంచాలి. ఈ దిశ సంపదదాయకమైనదిగా భావిస్తారు. బీరువాలో ఎర్రటి బట్టలో చుట్టిన వెండి నాణెం లేదా పసుపు కొమ్ము ఉంచడం వల్ల ధన ప్రాప్తి జరుగుతుందని నమ్మకం.

ప్రతి ఉదయం పక్షులకు గింజలు లేదా తిండి పెట్టడం వల్ల ఇంట్లో శుభ శక్తులు ప్రవేశిస్తాయని నమ్ముతారు. ఇది కర్మ ఫలితంగా మంచి శాంతిని కలిగిస్తుంది. పక్షులకు ఆహారం పెట్టడం ఒక సులభమైన, శక్తివంతమైన పరిహారం.

వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో కర్పూరం వెలిగించాలి. దాని వాసన చెడు శక్తులను తొలగించి శుభ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం దీపారాధన సమయంలో కర్పూరాన్ని ఉపయోగించడం శ్రేయస్కరం.

ప్రతి శనివారం రావి చెట్టు వద్ద పాలు, నల్ల నువ్వులు, బెల్లంతో అభిషేకం చేయాలి. ఆవ నూనెతో దీపం వెలిగించి చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి. దీని వల్ల ఉద్యోగ సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి.

పూజా గదిని తూర్పు భాగంలో ఏర్పాటు చేయడం మంచిది. ఒక్కో దేవుడికి ఒక్కో ఫొటో లేదా విగ్రహం మాత్రమే ఉంచాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. ఇది దైవ అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది.

ఇంట్లో ఎక్కడైనా నీరు వృథాగా లీక్ అవుతున్నట్లు కనిపిస్తే వెంటనే బాగు చేయించాలి. నీటి వృథా అంటే డబ్బు వృథా అని వాస్తు నమ్మకం. ఇంటి మెయిన్ గేటు శుభ్రంగా, వెలుతురుతో ఉండాలి.

ఈశాన్యంలో నీటి ఫౌంటెన్ లేదా కుబేరుని ప్రతిమను ఉంచితే ఆదాయం పెరుగుతుందనే నమ్మకం. ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను నైరుతి మూలలో ఉంచాలి. ఈ వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా మీ ఇంట్లో శాంతి, సౌభాగ్యం నిలిచిపోతాయి.