ఇంటి పైకప్పు లేదా కిటికీలపై పావురాలు విశ్రాంతి తీసుకోవడం ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. చాలా మంది ఇళ్లలో ఇలాంటిది జరుగుతుంది. కొంతమంది పక్షి ప్రేమికులు వాటిని తమ ఇళ్లలో కూడా పెంచుకుంటారు. అయితే పావురం రెట్టలు మీ ఊపిరితిత్తులకు ప్రమాదకరమని మీకు తెలుసా? అవును, పక్షి రెట్టల్లో ఉండే ఫంగస్ వల్ల బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్ అనే ఒక రకమైన హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ వంటి వ్యాధులు వస్తాయని, ఇది ఊపిరితిత్తులను పూర్తిగా దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఢిల్లీకి చెందిన ప్రముఖ పల్మోనాలజిస్ట్ డాక్టర్ ఒకరు మాట్లాడుతూ పక్షి ప్రేమికులకు ఎక్కువగా ఊపిరితిత్తుల మార్పిడి అవసరం పడుతుందన్నారు.. ఎందుకంటే ఇటీవల ముంబైలో ఇద్దరు పక్షి ప్రేమికులకు ఊపిరితిత్తులు అమర్చినట్టుగా చెప్పారు..ఇందుకు కారణంగా శ్వాసకోశ వ్యాధులు COVID-19 దుష్ప్రభావం కావచ్చునని వైద్యులు విశ్వసిస్తున్నారు. అయితే నగరాల్లో పావురాలు ఎక్కువగా ఉండే కాలనీల్లో ప్రజలకు ఊపిరితిత్తుల సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పారు. బాధితుల్లో ఊపిరి ఆడకపోవడం, తీవ్రమైన ఫైబ్రోసిస్ వంటి సమస్యలు తలెత్తున్నాయని తెలిపారు.
పక్షి రెట్టలో ఆస్పెర్‌గిల్లస్ వంటి శిలీంధ్రాలు ఉంటాయి. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తి, ఏదైన శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని మరింత అనారోగ్యానికి గురి చేస్తుంది. పావురాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వాటి రెట్ట కారణంగా.. “ఫంగస్ గాలిలో వ్యాపిస్తుంది.. అక్కడ గాలి పీల్చిన ప్రజల్లో హిస్టోప్లాస్మోసిస్‌కు కారణమవుతుంది. ఇది మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధి, పల్మనరీ ఫైబ్రోసిస్‌కు దారి తీస్తుంది. హిస్టోప్లాస్మోసిస్ అనేది పక్షి రెట్టలలో కనిపించే ఒక ఇన్ఫెక్షన్.” ఇది ఫంగస్ బీజాంశాలలో శ్వాస తీసుకోవడం వల్ల వస్తుంది.
అన్నింటిలో మొదటగా మీ ఇంటి దగ్గర పావురాలు గూళ్లు పెట్టకుండా చూసుకోండి. పావురాలు లోపలికి రాకుండా కిటికీలు, తలుపులను కవర్ చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల పావురాలు ఎక్కువగా ఉంటే తప్పకుండా మాస్క్‌ను జాగ్రత్తగా వాడండి. శరీరంలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. పావురం రెట్టలతో సంబంధం ఉన్న ప్రమాదాలను విస్మరించడం హానికరం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
ఊపిరితిత్తుల వ్యాధి ఊపిరితిత్తులలో గాయాలకు కారణమవుతుంది. ఇది ఒక వ్యక్తి శ్వాసక్రియ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్త ప్రసరణలోకి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. కోవిడ్ అనంతరం కోలుకున్న వారిలో ఒక సంవత్సరం తర్వాత కూడా శ్వాసకోశ సంబంధిత ఫిర్యాదులు ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ముఖ్యమని చెప్పారు. స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, లేద యోగ, వ్యాయామం వంటివి కూడా అలవాటు చేసుకోవటం మంచిదని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..