Papaya Skin Care : ఇది పండు కాదు ఔషధ గని.. ఆరోగ్యంతో పాటు అందానికి కేరాఫ్‌..!

బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్‌ చేసుకుంటే చర్మంపై మురికి మొత్తం క్లీన్ అవుతుంది. బొప్పాయిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కణాలను ఆరోగ్యంగా మార్చుతుంది. బొప్పాయి తింటే చర్మం మృదువుగా, యవ్వనంగా మారుతుంది. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్‌ చేయడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి. మృతకణాలు తొలగుతాయి.

Papaya Skin Care : ఇది పండు కాదు ఔషధ గని.. ఆరోగ్యంతో పాటు అందానికి కేరాఫ్‌..!
Papaya Skin Care

Updated on: May 27, 2025 | 1:49 PM

బొప్పాయి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా అద్భుతమైన మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయితో చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం కోసం ముఖానికి బొప్పాయిని అప్లై చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు..అందమైన, పట్టులాంటి మెరిసే చర్మం కోసం బొప్పాయి రెమిడీ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

బొప్పాయి చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు చర్మంపై తేమను నిలిపి ఉంచుతాయి. ముఖానికి బొప్పాయిని అప్లై చేయటం వల్ల చర్మంపై పగుళ్ల సమస్య ఏర్పడకుండా ఉంటుంది. బొప్పాయిలో బీటా-కెరోటిన్, విటమిన్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది. బొప్పాయిలోని విటమిన్ ఏ మొటిమలను నివారిస్తుంది. ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ మొటిమల మచ్చలు, మోచేతులు, మోకాళ్లపై నల్లటి మచ్చలను దూరం చేస్తుంది.

చర్మానికి బొప్పాయిని అప్లై చేయటం వల్ల దురద, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. బొప్పాయిలో మొక్కల ఆధారిత యాంటీఆక్సిడెంట్‌లు అధికంగా ఉండి చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్‌ చేసుకుంటే చర్మంపై మురికి మొత్తం క్లీన్ అవుతుంది. బొప్పాయిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కణాలను ఆరోగ్యంగా మార్చుతుంది. బొప్పాయి తింటే చర్మం మృదువుగా, యవ్వనంగా మారుతుంది. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్‌ చేయడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి. మృతకణాలు తొలగుతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..