
దేశంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేని వంటిల్లు ఉండడం చాలా అరుదు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచివా లేదా అనే దానిపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఎయిమ్స్ – హార్వర్డ్ వంటి సంస్థలలో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి, ఈ ఆహారాలపై శాస్త్రీయ ఆధారాలతో కూడిన స్పష్టతనిచ్చారు. దీర్ఘకాలిక ఆరోగ్యం, డిటాక్స్, క్యాన్సర్ నివారణకు ఉల్లిపాయలు, వెల్లుల్లి చాలా ముఖ్యమైనవని డాక్టర్ సేథి తేల్చి చెప్పారు.
గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ నిపుణుడైన డాక్టర్ సేథి, ఉల్లిపాయ, వెల్లుల్లిని పోషక శక్తి కేంద్రాలుగా అభివర్ణించారు. ఉల్లి, వెల్లుల్లి కాలేయంలో డీటాక్స్ ఎంజైమ్‌లను మరింత యాక్టివ్‌గా మారుస్తాయి. కణితి పెరుగుదలను నెమ్మదిస్తాయి” అని ఆయన చెప్పారు. గట్ మైక్రోబయోమ్ దృక్కోణం నుండి చూస్తే.. ఇవి ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను పోషిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ యొక్క సంకేతాలను మెరుగుపరుస్తాయి.
ఉల్లి, వెల్లుల్లి క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. వెల్లుల్లి – ఉల్లిపాయలలోని శక్తివంతమైన ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు ప్రోస్టేట్, కడుపు, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అనేక జనాభా అధ్యయనాల ప్రకారం, అల్లియం కూరగాయలను అధికంగా తినే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా తక్కువగా ఉంటుంది. రోజుకు 10 గ్రాముల కంటే ఎక్కువ ఈ కూరగాయలు తినే పురుషులలో ప్రమాదం చాలా తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.
డాక్టర్ సేథి ఒక ముఖ్యమైన వంటగది ఉపాయాన్ని కూడా పంచుకున్నారు. వెల్లుల్లిని దంచి, వంటలో వేసే ముందు 10 నిమిషాలు ఆపాలి. అప్పుడు మాత్రమే క్యాన్సర్‌తో పోరాడే శక్తివంతమైన పదార్థం అల్లిసిన్ తయారవుతుంది. వెంటనే వండితే ఆ శక్తి పోతుందని తెలిపారు. అందుకే ఉల్లిపాయలు, వెల్లుల్లి మన ఆరోగ్యానికి చాలా మంచివని, వీటిని నిస్సంకోచంగా తినవచ్చని డాక్టర్ సేథి స్పష్టం చేశారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..