Mango Uses: ఆ సమస్యకు మామిడి పండ్లతో చెక్.. సీజనల్‌గా దొరికే మామిడితో ఎన్నో ప్రయోజనాలు

|

Jun 10, 2023 | 6:00 PM

ముఖ్యంగా మామిడి పండ్ల వినియోగం తరచుగా బరువు పెరుగుదలతో ముడిపడి ఉంటుంది. అయితే మామిడిపండ్లను తగిన సమయంలో, తగిన పద్ధతిలో తినడం చాలా ముఖ్యం. మామిడికాయల్లో వివిధ రకాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రస్తుతం వేసవి నేపథ్యంలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Mango Uses: ఆ సమస్యకు మామిడి పండ్లతో చెక్.. సీజనల్‌గా దొరికే మామిడితో ఎన్నో ప్రయోజనాలు
Mango
Follow us on

సాధారణంగా భారతదేశంలో సీజనల్‌గా దొరికే పండ్ల వినియోగం భారీగా ఉంటుంది. అలాగే పండ్లల్లో రాజుగా మామిడి పండును పేర్కొంటున్నారు. ధనికుడి దగ్గర నుంచి పేదవాడి వరకూ మామిడి అందుబాటులో ఉంటుంది. కేవలం వేసవి కాలంలోనే ఈ మామిడి పండ్లు దొరుకుతూ ఉంటాయి. అయితే బరువు తగ్గేవారు తిండి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఎంత టెంప్టింగ్ ఫుడ్ కనిపించినా నోటికి తాళం వేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు కూడా మామిడి పండ్లు కనిపించగానే అదుపు తప్పుతూ ఉంటారు. ముఖ్యంగా మామిడి పండ్ల వినియోగం తరచుగా బరువు పెరుగుదలతో ముడిపడి ఉంటుంది. అయితే మామిడిపండ్లను తగిన సమయంలో, తగిన పద్ధతిలో తినడం చాలా ముఖ్యం. మామిడికాయల్లో వివిధ రకాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రస్తుతం వేసవి నేపథ్యంలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అయితే మామిడి పండ్లను తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారనే ఆలోచనతో చాలా మంది దూరంగా ఉంటారు. అయితే ఇది తప్పని నిపుణులు చెబుతున్నారు. మామిడిని క్రమపద్ధతిలో తింటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. మామిడి పండ్ల వినియోగంలో నిపుణులు సూచనలు ఏంటో ఓ సారి చూద్దాం.

మామిడిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో తింటే బరువు పెరగకుండా నిరోధించవచ్చు. మామిడిలో అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర నియంత్రణలో కూడా సహాయపడుతుంది. ఒక్క సాధారణ సైజు మామిడి పండులో 99 కేలరీలు, 1.4 గ్రాముల ప్రోటీన్, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 22.5 గ్రాముల చక్కెర, 2.6 గ్రాముల ఫైబర్, 67 శాతం విటమిన్ సి, 18 శాతం ఫోలేట్, 10 శాతం విటమిన్ ఎ, 10 శాతం విటమిన్ ఈ ఉంటాయి.  అలాగే కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం కూడా నిక్షిప్తమై ఉంటాయి. కొంచెం పుల్లగా ఉండే మామిడి కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మామిడిపండ్లు 51 జీఐ  ర్యాంక్‌ను కలిగి ఉన్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తినడానికి అనుకూలంగా ఉంటాయి.

మితంగా తీసుకోవడం మంచిది

మామిడిలో ఫైబర్, సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి; మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు వాటిని ఇప్పటికీ తినవచ్చు. అయితే మితంగా తినాలి. మామిడిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం.

ఇవి కూడా చదవండి

తిన్న తర్వాత మామిడికి దూరంగా ఉండాల్సిందే

చాలా మంది తిన్న తర్వాత మామిడిని తింటూ ఉంటారు. అలాగే పెరుగు అన్నంలో కలిపి మామిడిని తీసుకుంటూ ఉంటారు. ఇలా తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ శరీరం అదనపు కేలరీలను నిల్వ చేస్తుంది. మామిడి పండ్లను మధ్యాహ్నం తీసుకోవడం మంచిది. మీకు కావాలంటే మామిడి పండ్లను చిరుతిండిగా కూడా తినవచ్చు.

చిరుతిండిగా చాలా మేలు

ప్రతి రోజు ఒక గిన్నె మామిడి పండ్ల ముక్కలను అల్పాహారంగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మామిడి పండ్లలో పెద్ద మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. మామిడిపండ్లు కూడా మీకు మరింత శక్తిని కలిగిస్తాయి. మామిడిపండ్లు ఒక అద్భుతమైన ప్రీ-వర్కౌట్ భోజనంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

మామిడిని పండులా తినాల్సిందే

మామిడి ముక్కలు చేసే తినే బదులు మామిడి పండును మొత్తంగా తింటే చాలా మేలు. మనకు పెద్ద రసాలు, చిన్నరసాలు వంటి కాయలు ముక్కలు చేయడానికి పని చేయవు. కాబట్టి మామిడిని పండుగా మొత్తం తింటే మంచిది. ఇలా చేయడం ద్వారా మామిడిలో ఉండే పీచు రసం శరీరానికి మేలు చేస్తుంది. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..