శరీర అలసట తీర్చి తిరిగి యాక్టివ్ చేయడానికి నిద్రకు మించిన ఔషధం మరొకటి లేదు. అయితే ఉద్యోగం, ఇంటి పనులు, మానసిక ఇబ్బందులు, ఒత్తిడికారణంగా చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. నిద్రలేమికి ఇంకా పలు రకాల కారణాలు కూడా ఉన్నాయి. మారిన లైఫ్‌స్టైల్, చెడు ఆహార అలవాట్ల కారణంగా కూడా చాలా మంది రాత్రుళ్లు సరైన నిద్రలేక అవస్థలు పడుతుంటారు. నిద్రలేమి సమస్యకు మెగ్నీషియం లోపం కూడా ఓ ప్రధాన కారణం అంటున్నారు పోషకాహార నిపుణులు. మెగ్నీషయం లోపం నిద్రకు భంగం కలిగిస్తుందని చెబుతున్నారు.. మెగ్నీషియం లోపం అధిగమించడానికి కొన్ని ఆహారాలను మన డైట్‌లో చేర్చుకోవాలని చెబుతున్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం నుండి ఒత్తిడి వరకు అన్నింటికీ దారి తీస్తుంది. అనేక కారణాల వల్ల మీకు మంచి నిద్ర రాకపోవచ్చు. మీరు మీ నిద్రలేమికి సరైన కారణాన్ని తెలుసుకుని పరిష్కారం తీసుకోవటం చాలా ముఖ్యం. అయితే, మంచి నిద్రకు కొన్న ఇంటి చిట్కాలు, ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రిపూటా హాయిగా నిద్రపట్టాలంటే..సహాయపడే కొన్ని నట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా చదవాల్సిందే..
ఈ జాబితాలో బాదంపప్పులు మొదటి స్థానంలో ఉన్నాయి. బాదం మెగ్నీషియం మంచి మూలం. బాదంపప్పులో ఉండే మెగ్నీషియం మెలటోనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇది మంచి నిద్రకు తోడ్పడుతుంది. కాబట్టి రాత్రిపూట కొన్ని బాదంపప్పులు తింటే మంచి నిద్ర వస్తుంది. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
జీడిపప్పు కూడా మంచి నిద్రకు దారితీస్తుంది. నట్స్‌లో ఉండే మెగ్నీషియం మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది నిద్రకు తోడ్పడుతుంది. కాబట్టి జీడిపప్పు తినడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది.
అలాగే, వాల్‌నట్ కూడా మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే, పిస్తా కూడా..
మెలటోనిన్ పుష్కలంగా ఉండే గింజలలో పిస్తా ఒకటి. ఇది నిద్రకు సహాయపడుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కొన్ని పిస్తాపప్పులు తింటే మంచి నిద్ర వస్తుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..