
గులాబీ పువ్వు కేవలం ప్రేమకు గుర్తు మాత్రమే కాదు, అది ఆరోగ్యానికి రక్షణ కవచం కూడా. రోజ్ ఆయిల్ వాడకం వల్ల మానసిక ఒత్తిడి మాయమవ్వడమే కాకుండా, అంతర్గత అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. చర్మ సౌందర్యం నుంచి నరాల పటుత్వం వరకు ఈ నూనె చూపే ప్రభావం అమోఘం. వైద్య రంగంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మనసుకి ప్రశాంతత.. ఒత్తిడికి చెక్!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆందోళన (Anxiety), డిప్రెషన్ వంటి సమస్యలు సర్వసాధారణం. రోజ్ ఆయిల్ వీటిపై అద్భుతంగా పోరాడుతుంది. దీని సువాసన మనసును తేలికపరిచి, ఒత్తిడిని పూర్తిగా తొలగిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదొక సహజ సిద్ధమైన యాంటీ-డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది.
ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కవచం
రోజ్ ఆయిల్ కి సెప్టిసిమియాను నివారించే శక్తి ఉంది. గాయాలకు దీనిని రాయడం వల్ల వైరస్ లు, బ్యాక్టీరియా దరిచేరవు. ఇది కేవలం బాహ్య గాయాలకే కాదు.. టైఫాయిడ్, విరేచనాలు, కలరా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి అంతర్గత సమస్యలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
నరాల పటుత్వం, వృద్ధాప్య సమస్యలు
నరాల బలహీనతతో బాధపడేవారికి ఇది ఒక మంచి టానిక్ లా పనిచేస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో కనిపించే చేతుల వణుకును తగ్గించడానికి, నరాలను బలోపేతం చేయడానికి రోజ్ ఆయిల్ సహాయపడుతుంది. అలాగే కాళ్లు, చేతుల్లో కండరాల బలహీనత రాకుండా రక్షిస్తుంది.
స్త్రీల ఆరోగ్యానికి సంజీవని
మహిళల్లో గర్భాశయ సమస్యలకు రోజ్ ఆయిల్ మంచి నివారణగా పనిచేస్తుంది. కణితులు, క్రమరహిత రుతుచక్రాలు, అధిక రక్తస్రావం వంటి సమస్యలను నియంత్రించి, గర్భాశయాన్ని శుభ్రపరచడంలో ఇది తోడ్పడుతుంది. అయితే, దీనిని అంతర్గతంగా తీసుకునే ముందు వైద్యుల సలహా తప్పనిసరి.
జుట్టు చర్మ సౌందర్యం
రోజ్ ఆయిల్ జుట్టు మూలాలను బలపరుస్తుంది. తల చర్మంపై రక్త ప్రసరణను పెంచి చుండ్రును తగ్గిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపుని ఇవ్వడమే కాకుండా, మనల్ని రోజంతా తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.