Neem Leaves: కిడ్నీలో రాళ్లను కరిగించే వేప ఆకుల రసం.. డయాబెటిక్ రోగులు వేప ఆకులను తింటే ఎన్ని లాభాలున్నాయంటే..

|

Jun 25, 2021 | 8:08 AM

ప్రస్తుత కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను నియంత్రించడం కూడా ముఖ్యమే.

Neem Leaves: కిడ్నీలో రాళ్లను కరిగించే వేప ఆకుల రసం.. డయాబెటిక్ రోగులు వేప ఆకులను తింటే ఎన్ని లాభాలున్నాయంటే..
Neem Leaves
Follow us on

ప్రస్తుత కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను నియంత్రించడం కూడా ముఖ్యమే. ఇక ఇటీవల ఆయుర్వేదం.. పురాతన కాలం నాటి చెట్టు వైద్యం మీద ప్రజలకు విశ్వాసం ఎక్కువగా ఉంది. అలాగే మన చుట్టూ ఉండే చెట్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేవి ఉన్నాయి. అందులో ముఖ్యంగా వేప చెట్టు. దీనిని దేవతా మూర్తిగా భావిస్తుంటారు. ఇందులో ఔషద గుణాలను అధికంగా ఉన్నాయి. అంతేకాదు..దీనిని ఆయుర్వేదంలో పలు చికిత్సలకు ఉపయోగిస్తుంటారు. వేప ఆకులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మ సమస్యలను తొలగించడమే కాకుండా.. జుట్టు పెరుగుదలకు.. ఇతర వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది. వేప ఆకుల వలన కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందామా.

1. వేప ఆకులు చేదుగా ఉండడం వలన వీటిని తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా.. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. దీంతో అనేక రకాల శారీరక వ్యాధులు తొలగిపోతాయి.

2. మొటిమలు లేదా గాయాలను ఈ వేప ఆకులు నయం చేస్తాయి. మొటిమలు, గాయాలపై వేప ఆకుల పేస్ట్ రాయడం వలన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. గజ్జి లేదా దురద వంటి చర్మ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ వేప ఆకులను తినాలి. ఈ ఆకుల పేస్ట్ ను చిన్న చిన్న ట్యాబ్లెట్స్ గా చేసి ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని రోజూ సాయంత్రం నీటితో కలిపి రెండు వేసుకోవాలి.

4. వేప ఆకులను ఉడకబెట్టి ఆ నీటిని రోజూ తాగడం వలన కడుపులోని పురుగులు చనిపోవడమే కాకుండా.. జ్వరం, ప్లూ, ఇతర వ్యాధులను నయం చేయవచ్చు. గర్బిణీ స్త్రీ వేప నీరు తాగితే డెలివరీ సమయంలో నొప్పులు తక్కుగా వస్తాయి. కానీ డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే తీసుకోవాలి.

5. వేప కొమ్మతో పళ్లను శుభ్రం చేసుకోవడం ద్వారా చిగుళ్ల సమస్య తగ్గుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

6. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వేప ఆకులను ఆరబెట్టి వాటిని బూడిదగా మార్చి.. ప్రతిరోజూ గోరు వెచ్చని నీటితో కలిపి రెండు మూడు గ్రాములు తీసుకోవాలి. రాళ్లు కరిగిపోతాయి.

7. డయాబెటిక్ రోగులకు వేప ఆకులు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి. రోజు వేప ఆకులను తీసుకోవడం వలన గ్లోకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వేప ఆకుల రసం కూడా తీసుకోవచ్చు.

8. వేప ఆకులు జుట్టుకు సహజ కండీషనర్ గా పనిచేస్తాయి. వేప ఆకుల పేస్ట్ జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్య తగ్గుతుంది.

Also Read: Huzurabad by election: హుజూరాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం.. చకచక ఏర్పాట్లలో అధికారులు.. వ్యాక్సినేషన్‌లోనూ జోరు!

Chandrababu : మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో మామిడి రైతుల్ని దగా చేస్తోన్న గుజ్జు పరిశ్రమలు : చంద్రబాబు