Skin Care: వేపలోని ఔషధ గుణాలకు కొద్దిగా పెరుగు కలిపితే.. మీ చర్మ సౌందర్యానికి తిరుగు ఉండదు.. ఎలానో తెలుసుకోండి..

వేపలో యాంటీ బాక్టీరియల్..యాంటీ ఫంగల్ లక్షణాలు కనిపిస్తాయి. పెరుగును వారానికి 3 లేదా 4 సార్లు వేపను కలపడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.

Skin Care: వేపలోని ఔషధ గుణాలకు కొద్దిగా పెరుగు కలిపితే.. మీ చర్మ సౌందర్యానికి తిరుగు ఉండదు.. ఎలానో తెలుసుకోండి..
Skin Care

Updated on: Aug 10, 2021 | 8:18 PM

Skin Care: వేపలో యాంటీ బాక్టీరియల్..యాంటీ ఫంగల్ లక్షణాలు కనిపిస్తాయి. పెరుగును వారానికి 3 లేదా 4 సార్లు వేపను కలపడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. దీనిని తయారు చేయడానికి, ఒక చెంచా పెరుగుని రెండు చెంచాల వేప ఆకుల పేస్ట్‌లో కలపండి. వేప,పెరుగుతో చేసిన ఈ ప్యాక్ ఇచ్చే అద్భుతమైన ఆరోగ్య విషయాలు తెలుసుకుంటే వావ్ అంటారు.

చర్మం మెరుపును పెంచుతుంది

వేప -పెరుగు ఫేస్ ప్యాక్ చర్మ కణాలకు అవసరమైన పోషణను అందించే విటమిన్లు, పోషకాలను తగినంత మొత్తంలో కలిగి ఉంటుంది. ఇది చర్మ కాంతిని పెంచుతుంది.

చర్మ కణాలను బాగుచేస్తుంది..

వేప -పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్ చర్మం దెబ్బతిన్న కణజాలాన్ని బాగు చేస్తుంది. ఇది చర్మశుద్ధిని పెంచుతుంది.

గోరు మొటిమలు

వేప -పెరుగు  ఫేస్ ప్యాక్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగిఉంటుంది.  ఇది చర్మంలోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మొటిమల సమస్యను తొలగిస్తుంది.

బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి

వేప -పెరుగు ఫేస్ ప్యాక్‌లో ఉండే ఎలిమెంట్స్ చర్మాన్ని శుభ్రపరుస్తాయి, బ్లాక్ హెడ్స్ సమస్య నుండి బయటపడేస్తాయి. అదేవిధంగా ఇది గాయాలను నయం చేస్తుంది. గాయాలతో ఏర్పడిన మచ్చలను తొలగిస్తుంది. వేప – పెరుగు ఫేస్ ప్యాక్‌లో క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. దీనిని గాయం మీద అప్లై చేయడం ద్వారా, అది నయమవుతుంది అలాగే, మచ్చ కూడా పోతుంది.

చర్మంలో తేమను నిర్వహిస్తుంది..

వేప -పెరుగు  ఫేస్ ప్యాక్ చర్మంలో తేమను నిర్వహిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా,ఆరోగ్యంగా చేస్తుంది.

సన్‌స్క్రీన్‌లా పనిచేస్తుంది..

వేప -పెరుగు ఎలిమెంట్స్ ప్యాక్ ఫేస్ సన్‌స్క్రీన్‌లా పనిచేస్తుంది. దీన్ని రోజూ అప్లై చేయడం వల్ల సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.

ప్రతిరోజూ వేప – పెరుగు ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి , ముఖం క్లియర్ అవుతుంది. అలాగే, డార్క్ సర్కిల్స్ సమస్య తొలగిపోతుంది.

Also Read: Boredom: విసుగుతో వేగలేక విసిగిపోయారా? ఉల్లాసానికి ఊపిరి ఊదండి..మీ విసుగుకు వీడ్కోలు చెప్పండిలా..

Kitchen Tips: మీ ఇంట్లో కూరగాయలు తాజాగా ఉండాలా.. 15 రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండేందుకు ఇలా చేయండి..