
ఆయుర్వేద ప్రకారం మన శరీరంలో నాభి అనేది 72 వేలకు పైగా నరాలతో అనుసంధానించబడి ఉంటుంది. అందుకే నాభిలో కొన్ని చుక్కల నూనె వేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల శరీరం లోపలి నుండి ఆరోగ్యంగా మారడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆముదం, నెయ్యి, మంచి నూనె (నువ్వుల నూనె), ఆవ నూనె, కొబ్బరి నూనె మరియు వేప నూనె వంటి ఆరు రకాల నూనెలను నాభి మసాజ్‌కు ఉపయోగించవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి నిద్రపోయే ముందు ఈ నూనెలను రాయడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది, కీళ్ల నొप्पులు తగ్గుతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
నాభిలో ఆముదం రాసి మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల బిగువు తగ్గుతాయి. ఇందులో ఉండే రిసినోయిక్ ఆమ్లం వాపులను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యను నివారిస్తుంది.
నాభిలో నెయ్యి రాయడం విచిత్రంగా అనిపించినా, ఇది చర్మానికి అద్భుతమైన తేమను ఇస్తుంది. పొడి చర్మాన్ని నివారించి, హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నెయ్యి చాలా సహాయపడుతుంది.
నువ్వుల నూనె శరీరంలో ‘వాత దోషం’ను సమతుల్యం చేస్తుంది. నాభిలో ఈ నూనెను రాయడం ద్వారా నాడీ వ్యవస్థ బలపడి, మానసిక ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ గుణాలున్న ఆవ నూనెను నాభిలో మసాజ్ చేయడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పులు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.
కొబ్బరి నూనె శరీరానికి సహజమైన చల్లదనాన్ని ఇస్తుంది. నాభిలో కొబ్బరి నూనె రాయడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది, చర్మం లోపలి నుండి తేమను సంతరించుకుని కాంతివంతంగా మారుతుంది.
మొటిమలు, చర్మ సమస్యలతో బాధపడేవారికి వేప నూనె చాలా మంచిది. అయితే దీనిని నేరుగా కాకుండా కొద్దిగా కొబ్బరి నూనెతో కలిపి నాభిలో రాస్తే, శరీంలోని వ్యర్థాలుబయటకుపోయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
రోజూ రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం స్నానం చేసిన తర్వాత 2-3 చుక్కల నూనెను నాభిలో వేసి, చుట్టూ సున్నితంగా వృత్తాకారంలో మసాజ్ చేయాలి. క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని, అందమైన చర్మాన్ని పొందవచ్చు.