Mutton: తస్సాదియ్యా..! మటన్‌ వేపుడు ఇలా చేస్తే ఉంటుందీ.. లొట్టలేసుకుని తినేస్తారు.

|

Sep 22, 2024 | 7:54 AM

ఆదివారం వచ్చింది. నాన్‌ వెజ్‌ ప్రియులకు నోరు లాగేస్తుంటుంది. ఈరోజు కచ్చితంగా మటన్‌ లేదా చికెన్‌ ఇలా ఏదో ఒక వంటకం వంటింట్లో ఉడకాల్సిందే. అయితే ఎప్పుడూ ఒకేలా వంటకాలు చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అప్పుడప్పుడు కాస్త వెరైటీ డిష్‌లు ప్రయత్నిస్తే తినే వారికి, వంట చేసే వారికి ఇద్దరికీ కిక్‌ ఉంటుంది. మరి ఈ రోజు అలాంటి ఓ వెరైటీ వంటకం గురించింది ఇప్పుడు తెలుసుకుందాం...

Mutton: తస్సాదియ్యా..! మటన్‌ వేపుడు ఇలా చేస్తే ఉంటుందీ.. లొట్టలేసుకుని తినేస్తారు.
Mutton Roast
Follow us on

ఆదివారం వచ్చింది. నాన్‌ వెజ్‌ ప్రియులకు నోరు లాగేస్తుంటుంది. ఈరోజు కచ్చితంగా మటన్‌ లేదా చికెన్‌ ఇలా ఏదో ఒక వంటకం వంటింట్లో ఉడకాల్సిందే. అయితే ఎప్పుడూ ఒకేలా వంటకాలు చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అప్పుడప్పుడు కాస్త వెరైటీ డిష్‌లు ప్రయత్నిస్తే తినే వారికి, వంట చేసే వారికి ఇద్దరికీ కిక్‌ ఉంటుంది. మరి ఈ రోజు అలాంటి ఓ వెరైటీ వంటకం గురించింది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మటన్‌ అనగానే సూప్‌ పెట్టుకుంటారు, ఫ్రై చేసుకుంటారు, లేదా బిర్యానీ చేసుకొని తింటారు. కానీ మట్‌న్‌ వేపుడు మరింత రుచిగా ఉంటుంది. ముఖ్యంగా రోటి, నాన్‌, రైస్‌ ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్‌గా మట్‌ వేపుడు గురించి చెప్పుకోవచ్చు. మరి వంట రాని వారు కూడా చాలా సింపుల్‌గా మటన్‌ వేపుడును ఇంట్లో ఎలా రడీ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి.? తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు..

* మటన్‌ 1/2 కేజీ
* టీస్పూన్‌ పసుపు
* టీస్పూన్‌ కారం
* టీస్పూన్‌ ఉప్పు
* టీ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌
* పచ్చిమిర్చి, కరివేపాకు, లవంగాలు, దాల్చిన చెక్క
* ఉల్లిపాయలు

తయారీ విధానం..

ముందుగా మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసుకోవాలి. అనంతరం మటన్‌లో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్ల పేస్ట్ ఒక్కో స్పూన్‌ వేసుకోవాలి. అనంతరం రెండు పచ్చి మిర్చిలను సగానికి కోసి వేసుకోవాలి. అనంతరం రెండు కరివేపాకు రెబ్బలు, రెండు లేదా మూడు లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ తర్వాత మటన్‌ మునిగే వారు నీటిని పోసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 7 విజిల్స్‌ వచ్చే వరకు స్టౌవ్‌పై పెట్టాలి.
ఆ తర్వాత మటన్‌ ఉడికిందో లేదో నిర్ధారించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టౌవ్‌పై మరో బానీ పెట్టాలి అనంతరం అందులో మంచి నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత, రెండు ఉల్లిపాయలను కొసుకోని నూనెలో వేసి వేయించాలి. ఉల్లి పాయలు బ్రౌన్‌ కలర్‌ వచ్చిన తర్వాత కరివేపాకు, కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి.

అనంతరం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్‌ను నీటితో సహా వేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టి నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు వేడి చేయాలి. ఆ తర్వాత మటన్ కలర్‌ ఫ్రై అయి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మటన్‌లో మరో టీస్పూన్‌ కారం, టీస్పూన్‌ ధనియాల పొడితో పాటు సగం స్పూన్ గరం మసాలా, జిలకర్ర పొడి వేసుకొని బాగా కలపాలి. మంట తక్కువలో పెట్టుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి. చివరిగా సన్నగా తరిమిన కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ మటన్‌ రోస్ట్‌ రడీ అయినట్లే.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..