Mothers Day 2025: తల్లికి ప్రేమను చాటే అద్భుత బహుమతులు.. మదర్స్ డేకుబెస్ట్ గిఫ్ట్ ఐడియాలు ఇవే..!

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది మనిషికి ఏదీ లేదు. ఏ తల్లి అయినా తన బిడ్డ భవిష్యత్ బాగా ఉండాలని కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో మదర్స్ డే జరగనుంది. ఈ మదర్స్ డే రోజున తమ తల్లులకు మరుపురాని బహుమతులు ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు. ఈ నేపథ్యంలో మదర్స్ డే రోజు తల్లులకు గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ గిఫ్ట్ ఐడియాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

Mothers Day 2025: తల్లికి ప్రేమను చాటే అద్భుత బహుమతులు.. మదర్స్ డేకుబెస్ట్ గిఫ్ట్ ఐడియాలు ఇవే..!
Mothers Day 2025

Updated on: May 07, 2025 | 7:58 PM

అమెరికా, భారతదేశం, కెనడా, యూరప్‌లోని ఎక్కువ భాగంతో సహా అనేక దేశాల్లో మే 11, 2025 ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ రోజును పురస్కరించుకుని పిల్లలకు తమ తల్లులకు మంచి బహుమతులు ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ బహుమతులతోనే అమ్మను సంతోష పెట్టే బహుమతుల కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ది బెస్ట్ 5 గిఫ్ట్ ఐడియాలపై ఓ లుక్కేద్దాం. 

డిజిటల్ ఫోటో ఫ్రేమ్

మనకు తల్లితో ఉన్న అనుబంధాన్ని ఇప్పటికే చాలా వరకు ఫొటోల్లో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాం. ఈ అన్ని ఫొటోలను కలిపి డిజిటల్ ఫ్రేమ్‌గా లేదా షేర్డ్ ఆన్‌లైన్ ఆల్బమ్‌గా తయారు చేయండి. భౌతిక ఫోటోల మాదిరిగా కాకుండా ఈ ఆన్‌లైన్ ఆల్బమ్ ఆమెతో గడిపిన సంతోష సమయాన్ని గుర్తు చేస్తూ ుంటుంది. 

పూలు

మీరు మీ తల్లికి దూరంగా ఉంటే ఆమె ఉండే ప్రాంతానికి సమీపంలోని పూల వ్యాపారులు లేదా ఆన్‌లైన్ సేవల ద్వారా అదే రోజు డెలివరీ అయ్యేలా ఆమెకు ఇష్టమైన పూలతో బొకే పంపితే సప్రైజింగ్ గిఫ్ట్‌లా ఉంటుంది. ఇండోర్ ప్లాంట్ లేదా ఆమెకు ఇష్టమైన రంగు పూలను ఇవ్వడం ద్వారా సంతోషపెట్టవచ్చు. 

ఇవి కూడా చదవండి

ఈ-కార్ట్ గిఫ్ట్స్

ఆమెకు ఇష్టమైన వస్తువులను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సైట్స్‌లో ఆర్డర్ చేసి వాటితో పాటు ఈ-గిఫ్ట్ కార్డుతో ఆమె శుభాకాంక్షలు తెలపవచ్చు. లేదా ఆమె ఇష్టమైన భోజన డెలివరీ లేదా దుస్తుల యాప్ కోసం వోచర్‌లను వెంటనే ఈ-మెయిల్ చేయడం ద్వారా ఆమెకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకునేలా చేయవచ్చు. 

వీడియో మెసేజ్

మీ తల్లి మీకు ఎంత స్పెషల్? ఆవిడంటే మీకు ఎంత ఇష్టం అనే విషయాలను చెబుతూ ఓ లెటర్ రాసి ఆమెకు ఇవ్వడంతో పాటు వీడియో సందేశాన్ని ఆమెకు చూపండి. ఎందుకుంటే గిఫ్ట్ షాప్స్‌లో దొరికే లెటర్స్ కంటే స్వ దస్తూరితో రాసిన లెటర్‌ను ఆమెకు అపూరమైనదిగా ఉంటుంది. 

తల్లితో సమయం గడపడం

మదర్స్ డే రోజు మొత్తం మీ సమయాన్ని మొత్తం ఆమెకే కేటాయించండి. అది ఆమెకు మరుపురాని బహుమతిగా ఉంటుంది. ఆమెతో కలిసి సినిమా చూడటం, వాకింగ్‌కు వెళ్లడం లేదా టీ లేదా కాఫీ తాగుతూ సమయం గడపాలి. ఆమెను పని చేయనివ్వకుండా ఆ రోజు పని మొత్తం మీరే చేయడానికి ప్రయత్నించడం ఉత్తమం.