
ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అనేక అనారోగ్య సమస్యలకు ఇదే కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు, ఊబకాయం అనేవి ఈ రోజుల్లో ప్రజలు అత్యధికమంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య.. కరోనా తర్వాత చాలా మంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నట్లు అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. అయితే.. అధిక బరువు సమస్యకు.. మన వంటింట్లో ఉండే దినుసులతో చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. మీ మసాలా దినుసుల డబ్బాలోని కొన్ని పదార్థాలు అధిక బరువును కరిగించడానికి ఒక వరం లాంటివని.. బరువు తగ్గడానికి, బొడ్డు కొవ్వును కరిగించడానికి మీకు సహాయపడతాయని పేర్కొంటున్నారు.
ఆయుర్వేదం ప్రకారం, మీ వంటగదిలో ఉండే మెంతులు, వాము, కలోంజి, జీలకర్ర, అవిసె గింజలు వంటి పోషకాలతో కూడిన సుగంధ ద్రవ్యాలు బెలూన్ లాంటి పొట్టను పొగమంచులా కరిగించగల అద్భుత సుగంధ ద్రవ్యాలు.. బరువు తగ్గడానికి వాటిని ఎలా ఉపయోగించాలి.. అనే వివరాలను తెలుసుకుందాం..
ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన ఈ మసాలా పానీయం.. బొడ్డు కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, మెంతులు, వాము, కలోంజి, జీలకర్ర, అవిసె గింజలతో తయారు చేసిన పానీయం తాగడం వల్ల జీర్ణక్రియ బలపడటమే కాకుండా, వెన్నలాగా శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొలెస్ట్రాల్‌ను కూడా కరిగించవచ్చు.
మెంతులు, వాము, నల్ల జిలకర, జీలకర్ర, అవిసె గింజలను సమాన పరిమాణంలో తీసుకుని, ఎండలో ఆరబెట్టి, తక్కువ మంట మీద వేయించి, బాగా గ్రైండ్ చేసుకోవాలి..
మెంతులు, వాము, నల్ల జిలకర, జీలకర్ర, అవిసె గింజలతో తయారు చేసిన పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం స్టవ్ మీద ఉంచి నీరు సగానికి తగ్గే వరకు మరిగించి, తరువాత వడకట్టండి.
సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన మ్యాజిక్ డ్రింక్ లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి టీ లాగా తాగండి.
ఈ డ్రింక్ ప్రతిరోజూ తాగడం వల్ల మీ బెలూన్ లాంటి కడుపు కరిగిపోతుంది.. కేవలం ఒక నెలలోనే ప్లాట్ గా మారుతుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..
ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలుంటే.. వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..