Crying Benefits: మీకు తెలుసా.. ఏడ్చినా కూడా ఆరోగ్యానికి మంచిదేనట..

ఏడుపు అనేది దరిద్రంగా పరిగణిస్తూ ఉంటారు. చాలా మంది చిన్న చిన్న విషయాలకే ఏడుస్తారు. అందులోనూ చిన్న పిల్లల సంగతి చెప్పాల్సిన పని లేదు. ప్రతీ విషయానికి కూడా ఏడుస్తూనే ఉంటారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే అస్సలు ఏడవకూడదని చెబుతూ ఉంటారు. ఈ విషయం తెలిసిందే. అయితే ఏడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తమ భావోద్వేగాలను అనుచుకోకుండా.. బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకోవడం చాలా మంచిదని..

Crying Benefits: మీకు తెలుసా.. ఏడ్చినా కూడా ఆరోగ్యానికి మంచిదేనట..
Crying Benefits

Updated on: Mar 13, 2024 | 1:21 PM

ఏడుపు అనేది దరిద్రంగా పరిగణిస్తూ ఉంటారు. చాలా మంది చిన్న చిన్న విషయాలకే ఏడుస్తారు. అందులోనూ చిన్న పిల్లల సంగతి చెప్పాల్సిన పని లేదు. ప్రతీ విషయానికి కూడా ఏడుస్తూనే ఉంటారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే అస్సలు ఏడవకూడదని చెబుతూ ఉంటారు. ఈ విషయం తెలిసిందే. అయితే ఏడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తమ భావోద్వేగాలను అనుచుకోకుండా.. బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకోవడం చాలా మంచిదని అంటున్నారు. దీని వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా.. మానసిక ఆనందం కూడా కలుగుతుందని వెల్లడిస్తున్నారు. మరి కన్నీళ్లు పెట్టుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ప్రశాంతంగా ఉంటారు:

ఏడుపు వచ్చినప్పుడు ఏడ్వడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించకుండా ఏడిస్తే.. మనసు రిలాక్స్ అవుతుందట. ఇలా ఏడవడం వల్ల మంచి అనుభూతిని పొందుతారట. అంతేకాదు ఒత్తిడి కూడా తగ్గుతుందని, నిద్ర కూడా చక్కగా పడుతుందని, మైండ్ రిలాక్స్ అవుతుందని నిపుణులు అంటున్నారు. ఏడవడం వల్ల మనసులో ఉండే భారం కూడా తగ్గుతుందట. అలాగే పిల్లలు ఏడ్వడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

ఒత్తిడి పోతుంది:

ఏడవడం వల్ల ఒత్తిడి అనేది బాగా తగ్గిపోతుంది. మీరు బాధ పడినప్పుడు లేదా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు ఏడ్వడం వల్ల దాన్ని తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఏడపు అనేది మెడిసన్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏడ్వకుండా మీలోనే బాధను పెట్టుకోవడం వల్ల ఒత్తిడికి దారి తీస్తుంది. ఏడిస్తే.. ఒత్తిడి హార్మోన్లు, ఇతర రసాయనాలు అనేవి తగ్గుతాయి. మీను ఏడ్వాలి అనుకున్నప్పుడు ఏడ్చేయాలి. అప్పుడే మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి:

ఏడ్వడం వల్ల కళ్ల నుండి కన్నీళ్లు ప్రవహిస్తాయి. ఇలా కన్నీళ్ల రూపంలో.. కళ్లల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా పోతుంది. దీంతో కళ్లు క్లియర్‌గా అవుతాయి. ఏడ్వడం వల్ల కళ్లు పొడిబారకుండా ఉంటాయి. ఏడవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే ఏడ్వడం వల్ల లాభాలే ఉన్నాయి. నలుగురూ ఏదో అనుకుంటారని.. ఏడ్వకుండా ఉండటం వల్ల మీ బాధ అనేది మీలోనే ఉండిపోతుంది. దీంతో మీరు ఒత్తిడికి లోనై డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఏడ్వడం మంచిదే.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..