53 ఏళ్ల వయసులో మందిర బేడీ మాస్ వర్కవుట్స్.. ఏజ్‌తోపాటు స్ట్రాంగ్ అవుతున్న భామ

సినిమా ప్రపంచంలో ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వారు కొందరే ఉంటారు. వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని తన కండలు తిరిగిన శరీరంతో నిరూపిస్తోంది ఒక సీనియర్ నటి. 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఆమె చేస్తున్న వర్కవుట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

53 ఏళ్ల వయసులో మందిర బేడీ మాస్ వర్కవుట్స్.. ఏజ్‌తోపాటు స్ట్రాంగ్ అవుతున్న భామ
Mandira Bedi

Updated on: Feb 25, 2026 | 9:44 PM

ఫిట్‌నెస్ అంటే కేవలం సన్నగా ఉండటం కాదు, బలంగా ఉండటమని చాటి చెబుతున్న ఆ స్టార్ అథ్లెట్ ఎవరో తెలుసా?ఆమె ఒకప్పుడు బుల్లితెరపై ‘శాంతి’గా అందరినీ అలరించింది. ఆ తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా తనదైన ముద్ర వేసింది. సాధారణంగా వయసు 50 దాటిందంటే మహిళలు కీళ్ల నొప్పులు, నీరసం అంటూ ఫిట్‌నెస్‌ను పక్కన పెడుతుంటారు. కానీ, ఈ నటి మాత్రం తన 30, 40 ఏళ్ల వయసులో ఎత్తిన దానికంటే బరువైన వెయిట్స్‌ను ఇప్పుడు అవలీలగా ఎత్తేస్తోంది. తన కండరాలను చూపిస్తూ వయసు దాచాల్సిన అవసరం లేదని గర్వంగా చెబుతున్న ఆ ఫిట్‌నెస్ ఐకాన్ మరెవరో కాదు.. మందిర బేడీ.

వయసుతో పనేముంది?

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మందిర బేడీ తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. “నాకు ఇప్పుడు 53 ఏళ్లు. నా వయసును దాచాల్సిన అవసరం నాకు లేదు. 40 ఏళ్లలో కూడా నేను ఇంత దృఢంగా లేను. ఇప్పుడు నా 50లలో ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. గతంలో కంటే ఇప్పుడు నేను భారీ బరువులు ఎత్తుతున్నాను. కావాలంటే నా జాకెట్ తీసి నా కండరాలను మీకు చూపిస్తాను” అంటూ ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పింది.

వ్యాయామం అనేది కేవలం బరువు తగ్గడానికి చేసేది కాదని మందిర అభిప్రాయపడింది. “నా దృష్టిలో కదలిక అనేది ఒక మందు. వ్యాయామం అనేది నా శరీరానికి ఒక సప్లిమెంట్ లాంటిది. సప్లిమెంట్లు మనల్ని ఎలాగైతే ఆరోగ్యంగా, సరైన రూపంలో ఉంచుతాయో.. వ్యాయామం కూడా నన్ను అలాగే ఉంచుతుంది. అందుకే నేను అందరికీ ఇచ్చే ఒకే ఒక సలహా ఏంటంటే.. వ్యాయామం చేయండి. అది మీ జీవితాన్ని మారుస్తుంది” అని ఆమె వివరించింది.

సాధారణంగా 40, 50 ఏళ్ల వయసులో మహిళలు అనేక హార్మోన్ల మార్పులకు లోనవుతుంటారు. ఆ సమయంలో వచ్చే మానసిక, శారీరక ఒత్తిళ్లకు వ్యాయామమే సరైన విరుగుడు అని మందిర పేర్కొంది. వ్యాయామం చేయడం వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవచ్చని, అది కేవలం ప్రివెంటివ్ మెడిసిన్ లా మాత్రమే కాకుండా, రోగాల నుండి మనల్ని కాపాడే కవచంలా పనిచేస్తుందని ఆమె తెలిపింది.

మందిర బేడీ తన జీవితం ద్వారా ఒక కొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇస్తోంది. అదే ‘స్ట్రెంత్’. కేవలం బాహ్య సౌందర్యం కంటే అంతర్గత బలం ముఖ్యమని ఆమె నిరూపిస్తోంది. 50 ఏళ్ల వయసులో ఆమె చేస్తున్న ఈ సాహసోపేతమైన వర్కవుట్లు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

Follow Us