
కసూరి మేతి కావాలంటే జనాలు వెంటనే షాప్‌కు వెళ్లి టక్కున తెచ్చేస్తారు. కానీ ఇంట్లోనే మనం స్వచ్చమైన కసూరి మేతిని తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును మన ఇంట్లో వాడే మెంతులతో కసూరి మేతిని తయారు చేసుకొవచ్చు. ఈ మెంతులు మన ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు జుట్టు సంరక్షణకు, వంటకాల్లో రుచి పేంచేందుకు సహాయపడుతాయి. వీటిలో ఇందులో ఇనుము, కాల్షియం, విటమిన్లు ఎ, సి వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, మధుమేహం నియంత్రణ, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, మొత్తం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఈ మెంతులతో స్వచ్చమైన కసూరి మేతిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కసూరి మేతిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి?
స్టేప్-1: కసూరి మేతిని తయారు చేయడానికి, మీకు తాజా, ఆకుపచ్చ మెంతి ఆకులు అవసరం పడుతాయి. ఇందుకోసం మీరు మార్కెట్ వెళ్లి తాజాగా ఉండే మెంతి ఆకులను తెచ్చుకోండి. లేదా మీరు ఇంట్లోనే మెంతులను పండిస్తే.. వాటి ఆకులను తీసుకొండి. తర్వాత ఆ ఆకులను కొమ్మల నుంచి వేరు చేసి వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
స్టెప్-2: రెండో దశలో కడిగిన మెంతి ఆకులను ఉన్న నీరు పోయేదాక వాటిని ఆరబెట్టండి. ఆకులు పూర్తిగా ఆరిన తర్వాత, మైక్రోవేవ్-సేఫ్ ట్రే తీసుకొని ట్రేపై ఆకులను సమానంగా వేయండి. ట్రేని మైక్రోవేవ్‌లో ఉంచి 3 నిమిషాలు వేడి చేయండి. తర్వాత ట్రేని తీసివేసి, ఆకులను తిప్పి మళ్ళీ వేడి చేయండి. ఈ ప్రక్రియను రెండు లేదా మూడు సార్లు పునరావృతం చేయండి.
స్టెప్ 3: మైక్రోవేవ్ నుండి మెంతి ఆకులను తీసివేసిన తర్వాత, వాటిని చల్లబరిచి, ఆపై ఎండిన ఆకులను మీ అరచేతులతో కొద్దిగా పెద్దవి అయ్యే వరకు నలగగొట్టండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్తైయితే ఇక కసూరి మేథి సిద్ధమైనట్టే. తయారుచేసిన కసూరి మేథిని గాలి చొరబడని గాజు పాత్రలో స్టోర్ చేసి దాన్ని మీరు వంటలోకి ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతిని ఉపయోగించి, మీరు కసూరి మేథిని తయారు చేస్తే, దాని వాసన, తాజాదనం సంవత్సరాల తరబడి అలాగే ఉంటాయి.
కసూరి మేథీని ఈ పద్ధతిలో కూడా తయారు చేయవచ్చు
మీరు మైక్రోవేవ్ ఉపయోగించకుండా కూడా కసూరి మేతిని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం మెంతి ఆకులను శుభ్రం చేసిన తర్వాత, వాటిని ఒక పేపర్ లేదా కాటన్ క్లాత్‌పై పరిచి, ఫ్యాన్ కింద ఆరబెట్టిండి, ఆకులు ఆరిన తర్వాత, అవి క్రిస్పీగా మారే వరకు ఎండలో ఆరబెట్టండి. తరువాత, వాటిని మీ చేతులతో చూర్ణం చేసి, గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసి వాడుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.