
గులాబీలను ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందం, అందానికి చిహ్నంగా భావిస్తారు. వివిధ రకాల గులాబీలు వేర్వేరు భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. ప్రేమకు చిహ్నంగా ఉండే గులాబీలు మీ ముఖానికి గులాబీ రంగును ఇవ్వడానికి కూడా సహాయపడతాయి. అవును, ఇది వింతగా అనిపించవచ్చు. కానీ, మీరు గులాబీలను ఉపయోగించడం ద్వారా మెరిసే చర్మాన్ని పొందవచ్చు. రోజ్ వాటర్ లో కాటన్ బాల్ ముంచి మీ ముఖానికి అప్లై చేయండి. ఇది మీ చర్మాన్ని శుభ్రపరచడానికి, మురికి, ఆయిల్‌ని తొలగించడానికి సహాయపడుతుంది. మీరు దీన్ని రోజుకు రెండుసార్లు ఉపయోగించవచ్చు.
ముఖాన్ని వాష్ చేసిన తర్వాత రోజ్ వాటర్‌ని కాటన్ ప్యాడ్‌తో రాసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. ఇది నేచురల్ టోనర్ లాగా పనిచేసి గ్లో పెంచుతుంది. రోజ్ వాటర్‌తో ముఖంపై ఉన్న మేకప్ కూడా తొలగించొచ్చు. రోజ్ వాటర్‌లో కొంచెం కొబ్బరి నూనె కలిపితే మేకప్ ఈజీగా పోతుంది. చర్మం కూడా మృదువుగా ఉంటుంది.
రోజ్ వాటర్‌ని స్ప్రే బాటిల్‌లో వేసి ముఖంపై స్ప్రే చేస్తే చర్మం తేమ కలిగి ఉంటుంది. ఎల్లపుడూ అందంగా, తాజాగా కనబడతారు.
రోజ్ వాటర్‌లో గ్లిజరిన్ వేసి రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి, చర్మానికి రాసుకోవాలి. ఇలా చేస్తే చర్మం తేమ కలిగి ఉంటుంది. చర్మం పొడిగా మారకుండా చూసుకోవచ్చు. రోజ్ వాటర్‌లో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే బ్యాక్టీరియా తగ్గుతుంది, పింపుల్స్ కూడా తొలగిపోతాయి.
రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్స్ నానబెట్టి కళ్ల కింద పెట్టుకోవాలి. దీంతో డార్క్ సర్కిల్స్ తొలిగిపోతాయి. కళ్లు అందంగా కనిపిస్తాయి.
రోజ్ వాటర్‌లో శనగపిండి, నిమ్మరసం వేసి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోండి. 20 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది. రోజ్ వాటర్‌లో కలబంద గుజ్జు కలిపి ఆయిల్ స్కిన్ ఉన్న వారు ముఖానికి రాసుకోవచ్చు. తద్వారా చర్మం తాజాగా ఉంటుంది. రోజ్ వాటర్‌ని ఎలాంటి ఫేస్ ప్యాక్‌లో అయినా వేసి ముఖానికి రాసుకుంటే సహజ కాంతి వస్తుంది. మృదుత్వం కూడా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..