Long Distance Relationship: మీ భాగస్వామితో స్ట్రాంగ్ రిలేషన్‌షిప్‌ ఎలా కొనసాగించాలి? దంపతులు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు..

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌లో భార్యాభర్తలిద్దరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండటం వల్ల నెలల తరబడి కలుసుకోలేకపోతుంటారు. ఇలా సమయాభావం వల్ల రిటేషన్‌షిప్‌లో గ్యాప్ వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా సంబంధాన్ని ఎలా కంటిన్యూ చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Long Distance Relationship: మీ భాగస్వామితో స్ట్రాంగ్ రిలేషన్‌షిప్‌ ఎలా కొనసాగించాలి? దంపతులు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు..
Long Distance Relationship

Updated on: Aug 03, 2023 | 12:20 PM

Long Distance Relationship: ఏదైనా సంబంధంలో కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో సంబంధాన్ని స్ట్రాంగ్‌గా ఉంచుకోవడానికి కమ్యూనికేషన్(సంభాషణలు) అనేది చాలా కీలకం. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌లో భార్యాభర్తలిద్దరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండటం వల్ల నెలల తరబడి కలుసుకోలేకపోతుంటారు. ఇలా సమయాభావం వల్ల రిటేషన్‌షిప్‌లో గ్యాప్ వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా సంబంధాన్ని ఎలా కంటిన్యూ చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో చాలా మంది మంచి భవిష్యత్ కోసం, మంచి ఉద్యోగాల కారణంగా సుదూర ప్రాంతాలకు, నగరాలకు, విదేశాలకు వెళ్తున్నారు. ఈ కారణంగా వారు సహజంగానే తమ భాగస్వామికి దూరం అవ్వాల్సి వస్తుంది. ఉద్యోగ రిత్యా బిజీగా ఉండటం, ఇతర కారణాలతో వారు తమ భాగస్వామిని కలుసుకోలేకపోతుంటారు. వారి ప్రేమను వ్యక్తం చేయలేని పరిస్థితి ఉంటుంది. సరైన సమయాన్ని కేటాయించలేకపోతుంటారు. భార్యాభర్తల మధ్య ఈ దూరం వారి ప్రేమకు పరీక్షగా చెప్పుకోవచ్చు. అయితే, చాలాసార్లు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో అనుమానం, సమయం కేటాయించలేకపోవము, ఇవన్నీ రిలేషన్‌షిప్‌లో చీలికకు దారితీస్తాయి. సంబంధాన్ని కొనసాగించడం కష్టంగా మారుతుంది. మరి బంధంగా దృఢంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బంధాన్ని బలోపేతం చేసే మార్గం..

కమ్యూనికేషన్: లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ముఖాముఖి కలుసుకోలేని పరిస్థితి ఉన్నందున.. ఫోన్ కాల్, వీడియో కాల్‌, మెసేజ్‌ల ద్వారా ఒకరి భావాలను మరొకరు పంచుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించాలి. మంచి కమ్యునికేషన్.. మీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది.

ఇవి కూడా చదవండి

అనుమానించొద్దు: లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు సాధారణంగా తమ భాగస్వామిని కొన్ని కారణాల వల్ల అనుమానిస్తుంటారు. అయితే, ఎప్పుడూ అలా చేయొద్దు. అభద్రతా భావాలు సంబంధం విచ్ఛిన్నానికి దారి తీస్తాయి. అందుకే మీ భాగస్వామిపై పూర్తి విశ్వాసం ఉంచాలి. ప్రతి విషయంలోనూ అనుమానంగా చూడటం ఆపేయండి.

టెక్నాలజీని ఉపయోగించండి: మీరిద్దరూ శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ.. కొన్ని సృజనాత్మక మార్గాల ద్వారా మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఇద్దరూ కలిసి ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం, సర్‌ప్రైజ్ గిప్ట్‌లు పంపడం, ప్రేమ లేఖలు పంపడం ద్వారా మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్‌గా మార్చుకోవచ్చు.

అబద్ధాలు చెప్పొద్దు: లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో చాలా మంది తమ భాగస్వామికి అనవసరంగా అబద్ధాలు చెబుతుంటారు. అది వారి బంధాన్ని దెబ్బతీస్తుంది. నమ్మకం కోల్పోయి అనుమానాలకు తావిస్తుంది. అందుకే మీ భాగస్వామికి ఎట్టి పరిస్థితిలోనూ అబ్ధాలు చెప్పకుండా ఉండండి.

సమయం కేటాయించాలి: కొందరు బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వలేరు. దీని కారణంగా రిలేషన్‌లో గ్యాప్ ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిలో మీ భాగస్వామి కోసం ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించండి. ఆ కొద్ది సమయం కూడా మీ బంధాన్ని దృఢంగా మారుతుంది.

మరిన్ని జీవనశైలి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..