Alcohol: డైలీ ఆల్కహాల్ తీసుకుంటారా.. అధ్యయనంలో సంచలన నిజాలు..?

|

Feb 01, 2022 | 9:18 PM

Alcohol: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్కహాల్ వినియోగానికి ఒక ప్రమాణాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం

Alcohol: డైలీ ఆల్కహాల్ తీసుకుంటారా.. అధ్యయనంలో సంచలన నిజాలు..?
Alcohal
Follow us on

Alcohol: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్కహాల్ వినియోగానికి ఒక ప్రమాణాన్ని
నిర్దేశించింది. దీని ప్రకారం పురుషులు18 ml, మహిళలు 9 ml పరిమితిని నిర్ణయించారు.
మెడికల్ అసోసియేషన్ ప్రకారం మీరు ఈ పరిమితిలో ఆల్కహాల్ తీసుకుంటే సురక్షితంగా
ఉంటారు. మద్యం వల్ల మీకు ఎలాంటి హాని జరగదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లాగానే
UK మెడికల్ అసోసియేషన్ కూడా ఆల్కహాల్ వినియోగానికి ప్రామాణిక పరిమితిని నిర్దేశించింది.
ఇది సురక్షిత పరిమితిలో వస్తుంది. ఇలాంటి కొన్ని ప్రశ్నలతో కేంబ్రిడ్జ్‌లోని ఆంగ్లియా రస్కిన్
యూనివర్సిటీ పరిశోధకులు UKలోని సుమారు 3.5 మిలియన్ల మందిపై ఒక అధ్యయనాన్ని
నిర్వహించారు. దీని నివేదిక మెడికల్ జనరల్ “క్లినికల్ న్యూట్రిషన్”లో ప్రచురించారు.

ఈ అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. మీరు ఎంత మద్యం తాగుతున్నారన్నది
అనేది ముఖ్యం కాదు ఆల్కహాల్ తీసుకుంటున్నారా లేదా అనేదే ఇక్కడ లెక్క. ఈ అధ్యయనంలో
అధిక మొత్తంలో ఆల్కహాల్ తాగే వ్యక్తుల మాదిరిగానే కొద్ది కొద్దిగా ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులకు
కూడా ప్రమాదం పొంచి ఉంది. హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని
పరిశోధకులు కనుగొన్నారు.ఈ అధ్యయనం నమూనా చాలా పెద్దది. దీనిని నమ్మకపోవడానికి
కూడా ఎటువంటి కారణం లేదు. UK నుంచి సుమారు 3.5 మిలియన్ల మంది ఈ అధ్యయనంలో
పాల్గొన్నారు. వారి వివరణాత్మక డేటా సేకరించారు. వారి వయస్సు, జీవనశైలి, దినచర్య,
వినియోగించే ఆల్కహాల్ పరిమాణం, ఆల్కహాల్ రకం, బ్రాండ్, నాణ్యతను మొదలైన వాటిపై
అధ్యయనం చేశారు.

పరిశోధనలో కొద్దిగా మద్యం తాగే వ్యక్తులు, అప్పుడప్పుడు ఎక్కువ ఆల్కహాల్ తాగే వ్యక్తులు
సమానమే. వారి ఆరోగ్యానికి కూడా అదే హాని కలుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
ఎవరైనా ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం
మరింత ఎక్కువవుతుంది. ప్రస్తుతానికి, క్లుప్తంగా మీరు కొంచెం లేదా ఎక్కువ తాగాలని
కోరుకుంటున్నారు. అలాంటి సమయంలో ఈ అధ్యయనాన్ని గుర్తుంచుకోండి. ఆల్కహాలో
ఎప్పుడైనా ప్రమాదమే.

Realme: హృదయ స్పందన కొలిచే ఫీచర్‌తో వస్తున్న రియల్‌మి 9 ప్రో ప్లస్.. 5G సపోర్ట్ కూడా..?

Viral Photos: ఫిబ్రవరిలో ప్రేమికులు సందర్శించడానికి ఈ ప్రదేశాలు సూపర్.. అవేంటంటే..?

ఇంట్లో ఈ జీవి కనిపిస్తే ధనం, ఆనందానికి చిహ్నం.. త్వరలో సంపద రాబోతుందని అర్థం..?