రోగనిరోధక శక్తిని నింపే లెమన్ గ్రాస్ ‘టీ’.. రోజూ తాగితే ఎక్కువ కాలం జీవిస్తారా ?

|

Jun 18, 2024 | 10:00 PM

ఈ లెమన్ గ్రాస్ సిస్టోలిక్ రక్తపోటులో కాస్త తగ్గుదలను, డయాస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదలను తీసుకురావడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది.

రోగనిరోధక శక్తిని నింపే లెమన్ గ్రాస్ ‘టీ’.. రోజూ తాగితే ఎక్కువ కాలం జీవిస్తారా ?
Lemon grass tea health benefits
Follow us on

లెమన్ గ్రాస్ టీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. నిమ్మగడ్డితో చేసిన టీ తాగితే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది. లెమన్ గ్రాస్ టీ క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. జీర్ణ సమస్యలు, నిద్రలేమి సమస్యలకు చెక్ పెడుతుంది. కిడ్నీ, ఒత్తి, తలనొప్పి సమస్యలకు నిమ్మగడ్డితో చేసిన టీ చక్కగా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్ టీ తాగితే దగ్గు, జలుబు, అలర్జీ, గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్ బయటకు పోతాయి.

లెమన్ గ్రాస్ టీలో ఎన్నో పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను స్వీకరిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. లెమన్ గ్రాస్‌లో సిట్రల్, జేరేనియల్ అనే రెండు ప్రధాన పదార్థాలు ఉంటాయి. ఇవి గుండెకు రక్షణ కల్పిస్తాయి.

లెమన్ గ్రాస్ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అలాగే లెమన్ గ్రాస్ ఉన్న సిట్రల్ శరీరంలో క్యాన్సర్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఇది ప్రభావంవంతమైన యాంటీ క్యాన్సర్ సామర్ధ్యాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ తో పోరాడటానికి ఎంతో సాయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని అందిస్తుంది. అలాగే క్యాన్సర్ బారినపడి కీమోథెరపీ, రేడియేషన్ తీసుకుంటున్న వారు కూడా లెమన్ గ్రాస్ టీని తాగడం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల అది రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఈ లెమన్ గ్రాస్ సిస్టోలిక్ రక్తపోటులో కాస్త తగ్గుదలను, డయాస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదలను తీసుకురావడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..