సండే ఇంట్లో అందరూ కాలీగా ఉంటారు. రోటీన్‌గా కాకుండా సాయంత్రం ఏదైనా తినాలి అనుకొంటారు. కానీ ఏం తినాలో అనే అమోమయంలో ఉండిపోతారు. అలాంటి వారికోసమే ఈ రెసిపీ. మీరు సాయంత్రపు స్నాక్‌గా విభిన్నమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైనదాన్ని ఫుడ్ ఏదైనా తినాలనుకుంటే.. రాగి కట్‌లెట్ ఓ గొప్ప ఎంపిక అవుతుంది.దీని ఇంట్లోనే ఈజీగా మీరు త్వరగా చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం.
చాలా మంది ఇంట్లో చేసుకుంటే టైం పడుతుందని సాయంత్రం స్నాక్స్ కోసం బయటకు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మేం చెప్పిబోయే రెసిపీ గురించి తెలిస్తే మీరు మరోసారి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటారు. అవును రాగి వడ సాయంత్రపు స్నాక్ కోసం ఓ మంచి ఎంపిక. వీటిని ఇంట్లోనే త్వరగా రెడీ చేసుకోవచ్చు. అంతేకాదు ఇవి చాలా ఆరోగ్యకరమైనవి కూడా. రాగి, కూరగాయలతో చేసిన ఈ కట్‌లెట్‌లు ఎంత ఆరోగ్యకరమో అంతే రుచిగా కూడా ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే రాగి వడలను ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
రాగి వడ తయారికి కావాల్సిన పదార్థాలు
1 కప్పు రాగి పిండి
2-3 కప్పుల మెత్తగా చేసిన బంగాళదుంపలు
1 తరిగిన ఉల్లిపాయ
1 తరిగిన క్యారెట్
1 తరిగిన క్యాబేజీ
1 టీస్పూన్ కారం పొడి
1 టీస్పూన్ గరం మసాలా
1/2 టీస్పూన్ నల్ల మిరియాల పొడి
రుచికి సరిపడా ఉప్పు
రాగి వడ ఎలా తయారు చేయాలి?
ఒక గిన్నెలో క్యారెట్లు, ఉల్లిపాయలు, క్యాబేజీ, మెత్తగా చేసిన బంగాళదుంపలను తీసుకోండి.
దానిలో కారం పొడి, నల్ల మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలపండి.
ఈ మిశ్రమానికి రాగి పిండిని కలిపి మెత్తటి పిండి ముద్దలా చేయండి.
ఈ పిండి ముద్దతో చిన్న గుండ్రని కట్లెట్స్ లేదా టిక్కీలను తయారు చేసుకోండి.
ఒక బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి, కట్లెట్స్‌ను రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు మధ్యస్థ మంట మీద వేయించండి.
కట్లెట్స్ బంగారు గోధుమ రంగులోకి మారి, కరకరలాడుతున్నప్పుడు వాటిని దించండి.
అంతే మీ వేడి వేడి రాగి కట్లెట్స్‌ను రెడీ అయినట్టే.. దీని పక్కలోని ఒక చట్నీ పెట్టుకొని తింటే అదిరిపోద్దంతే