AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రోజుల్లో హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారా..? జాగ్రత్త.. మీ ఆయుష్షు తగ్గుతుందట..

సనాతన ధర్మంలో ప్రతి పనికీ ఒక నియమం ఉంటుంది. కేవలం శుభకార్యాలకే కాదు.. జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీసుకోవడం వంటి నిత్యకృత్యాలకు కూడా మన పెద్దలు నిర్దిష్ట సమయాలను కేటాయించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ వారంలో జుట్టు కత్తిరించుకుంటే ఆయుష్షు పెరుగుతుంది? ఏ రోజుల్లో కటింగ్ చేయించుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై దారిద్ర్యం చుట్టుముడుతుంది? వంటి విషయాలను తెలుసుకుందాం..

ఈ రోజుల్లో హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారా..? జాగ్రత్త.. మీ ఆయుష్షు తగ్గుతుందట..
Best Days For Haircut According To Astrology
Krishna S
|

Updated on: Mar 28, 2026 | 8:06 PM

Share

భారతీయ సనాతన ధర్మంలో ప్రతి చిన్న పనికీ ఒక కాల నియమం, శాస్త్రీయ కారణం దాగి ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీసుకోవడం వంటి విషయాల్లో మన పెద్దలు నిర్దిష్టమైన వారాలను, తిథులను అనుసరించాలని చెబుతుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మన శరీరంలోని గోర్లు, జుట్టు శని ప్రభావానికి లోనవుతాయి. వీటిని సరైన సమయంలో కత్తిరించుకోకపోతే గ్రహ గతులు మారి, అది మన ఆయుష్షు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పండితులు హెచ్చరిస్తుంటారు.

హెయిర్ కటింగ్‌కు సమయం చాలా ముఖ్యం. శాస్త్రాల ప్రకారం సూర్యోదయం తర్వాత.. అంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు జుట్టు కత్తిరించుకోవడం అత్యంత శ్రేష్ఠం. ఈ సమయంలో ప్రకృతిలో సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి వేళల్లో జుట్టు కత్తిరించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుందని నమ్ముతారు. అలాగే ఒకే ఇంట్లో ఉండే తండ్రి – కొడుకులు లేదా అన్నదమ్ములు ఒకే రోజు కటింగ్ చేయించుకోకూడదనే నియమం కూడా ఉంది. ఇది వారి మధ్య బంధంపై ప్రభావం చూపుతుందని చెబుతారు.

వారాల విషయానికి వస్తే.. సోమవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం వల్ల ఏడు నెలల ఆయుష్షు పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోసం చూస్తున్న వారు ఒకే కుమారుడు ఉన్నవారు సోమవారాన్ని ఎంచుకోవడం శుభప్రదం. బుధవారం నాడు కటింగ్ చేసుకుంటే ఐదు నెలల ఆయుష్షు వృద్ధి చెందుతుందని, బుధ గ్రహ ప్రభావంతో వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం వల్ల 11 నెలల ఆయుష్షు పెరుగుతుందట. ఇది కళాకారులకు మరియు విజయం ఆశించే వారికి ఎంతో మేలు చేస్తుంది.

మరోవైపు కొన్ని వారాల్లో కటింగ్ చేయించుకోవడం ఆయుష్షును హరిస్తుంది. మంగళవారం నాడు జుట్టు కత్తిరిస్తే ఎనిమిది నెలల ఆయుష్షు తగ్గుతుందని, ఇది అప్పుల బాధలకు, అనారోగ్యానికి దారితీస్తుందని విశ్వసిస్తారు. శనివారం నాడు కటింగ్ చేయించుకుంటే ఏడు నెలల ఆయుష్షు తగ్గుతుంది. ఇది శని దేవుడి ఆగ్రహానికి కారణమై మృత్యు భయాన్ని కలిగిస్తుందని భక్తుల నమ్మకం. గురువారం నాడు జుట్టు కత్తిరించుకోవడం వల్ల పది నెలల ఆయుష్షు పెరిగినప్పటికీ, ఆ రోజు గురు గ్రహానికి, లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కావడంతో ధన నష్టం జరిగే అవకాశం ఉందని, అందుకే చాలా మంది ఆ రోజున క్షురకర్మకు దూరంగా ఉంటారు.

ఆదివారం శ్రీమన్నారాయణుడికి అంకితం చేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కటింగ్ చేసుకుంటే ఒక నెల ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. వారాలతో పాటు తిథులను కూడా గమనించాలి. విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి తిథులు ఈ పనులకు అత్యంత అనుకూలమైనవి. అయితే చవితి, షష్ఠి, అష్టమి వంటి తిథుల్లో, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం అశుభంగా పరిగణిస్తారు. అలాగే పండుగ రోజున, మన జన్మ నక్షత్రం ఉన్న రోజున, భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త కటింగ్ చేయించుకోకపోవడం మన సంప్రదాయంలో ఉన్న ఒక విశిష్టమైన నమ్మకం.

Follow Us
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు..
ఇలాంటోళ్ల నుంచి మాత్రం అప్పు తీసుకోకండి!
ఇలాంటోళ్ల నుంచి మాత్రం అప్పు తీసుకోకండి!
విజయ్, త్రిష పెళ్లి..ఇద్దరి జాతకం చూస్తే కళ్లు చెదిరిపోవడమే..
విజయ్, త్రిష పెళ్లి..ఇద్దరి జాతకం చూస్తే కళ్లు చెదిరిపోవడమే..
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌