AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moles: ఆడవారికి, మగవారికి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే మంచిదో తెల్సా.?

శరీరంపై ఉండే పుట్టుమచ్చలు మన వ్యక్తిత్వాన్ని, అదృష్టాన్ని, భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసా.? స్త్రీ, పురుషులకు ఏయే భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే శుభప్రదమో శాస్త్ర నిపుణుల ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి. లేట్ ఎందుకు ఈ స్టోరీలో ఒకసారి చూసేయండి మరి.

Moles: ఆడవారికి, మగవారికి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే మంచిదో తెల్సా.?
Moles
Ravi Kiran
|

Updated on: Mar 28, 2026 | 8:05 PM

Share

సాధారణంగా పుట్టుమచ్చలు కేవలం శరీర లక్షణాలని మనం అనుకుంటాం. కానీ, జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాల ప్రకారం, పుట్టుమచ్చలు ఒక వ్యక్తి జీవిత గమనాన్ని, స్వభావాన్ని, ఆర్థిక స్థితిని సూచిస్తాయి. ఏయే స్థానాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం.

అదృష్టాన్ని ఇచ్చే పుట్టుమచ్చలు

నాలుకపై పుట్టుమచ్చ:

ఇది స్త్రీ, పురుషులకు చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. వీరు సంభాషణల్లో ఇతరులను ఆకట్టుకుంటారు. వీరికి అపారమైన కీర్తి, సంపద లభిస్తాయి. వీరు కోపంలో అన్న మాటలు కూడా కొన్నిసార్లు నిజమవుతుంటాయని నమ్ముతారు.

అరచేతిలో పుట్టుమచ్చ:

పురుషులకు కుడి అరచేతి మధ్యలో ఉంటే అపారమైన ధనం, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. స్త్రీలకు ఎడమ అరచేతిలో ఉంటే అది ఐశ్వర్యానికి సంకేతం.

కంటి లోపల:

కళ్లలో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ మచ్చ ఉంటే మంచి ఆస్తిపరుడైన భర్త లభిస్తాడని శాస్త్రం చెబుతోంది.

కుడి చెంపపై (స్త్రీలకు):

ఇది స్త్రీలకు అత్యంత శుభప్రదం. వీరికి జీవితంలో ఉన్నత స్థాయి గౌరవం, యోగం దక్కుతాయి. అయితే ఎడమ చెంపపై పుట్టుమచ్చ అంత అనుకూలం కాదు.

మిశ్రమ ఫలితాలు ఇచ్చేవి..

ముక్కుపై పుట్టుమచ్చ:

వీరిలో అదృష్టం ఉన్నప్పటికీ కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. వారి ఆగ్రహాన్ని తగ్గించడం కష్టమవుతుంది.

నుదుటిపై పుట్టుమచ్చ:

ఇది కొందరికి అదృష్టాన్ని ఇస్తే, మరికొందరికి కోర్టు గొడవలు లేదా న్యాయపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అశుభ ఫలితాలు ఉంటే ఏం చేయాలి?(పరిహారాలు)

ఒకవేళ పుట్టుమచ్చలు సరైన స్థానంలో లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అనిపిస్తే, ఈ క్రింది పద్ధతులు పాటించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం.

సూర్యాష్టకం పఠించడం.

రెగ్యులర్‌గా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడం. గుర్తుంచుకోండి, పుట్టుమచ్చలు సూచనలు మాత్రమే. మన నిరంతర కృషి, పట్టుదల, భగవంతునిపై భక్తి మన తలరాతను సానుకూలంగా మార్చగలవు.

Follow Us