Late-Night Hunger: అర్ధరాత్రి ఆకలి అనిపిస్తుందా..! పడుకునే మందు వీటిని తినండి.. నిద్రాభంగం కలుగదు..

మారిన జీవన శైలిలో భాగంగా తినే ఆహారంలో ఆహార సమయంలో కూడా మార్పులు వచ్చాయి. దీంతో చాలా మంది రాత్రి భోజనం తినే సమయంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. దీంతో కొంతమందికి రాత్రి తిన్న తర్వాత కూడా ఏదైనా తినాలని అనిపిస్తుంది. మరికొందరికి అర్ధరాత్రి కూడా ఆకలిగా అనిపిస్తుంది. అర్ధరాత్రి ఆకలి అనిపించకుండా ఉండాలంటే.. రాత్రి నిద్రపోయే ముందు కొన్నిటిని తినవచ్చు. వీటిని తిన్న తర్వాత కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఆకలి వేయదు. నిద్రకు భంగం కూడా కలగదు.

Late-Night Hunger: అర్ధరాత్రి ఆకలి అనిపిస్తుందా..! పడుకునే మందు వీటిని తినండి.. నిద్రాభంగం కలుగదు..
Late Night Hunger

Updated on: Jun 18, 2025 | 1:46 PM

రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా.. చాలాసార్లు అకస్మాత్తుగా ఆలస్యంగా ఆకలి వేయడం మొదలవుతుంది. ప్రస్తుతం చాలా మందికి ఈ సమస్య ఒక సాధారణ సవాలుగా మారింది. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేసేవారు.. అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఆకలిగా అనిపిస్తుంది. ఇది ఒక సాధారణ సమస్య. ఒకొక్కసారి రాత్రి ఆకలి వలన నిద్రకు అంతరాయం కలిగించడమే కాదు బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది.

రాత్రి ఆకలిగా అనిపించినప్పుడు.. ప్రజలు తరచుగా చిప్స్, స్వీట్లు లేదా ఇతర అనారోగ్యకరమైన స్నాక్స్ తింటారు. వీటిని తినడం వలన బరువు పెరగడం మాత్రమే కాదు జీర్ణక్రియ, నిద్ర నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. రాత్రి ఆకలిగా అనిపించడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ప్రధాన కారణాలలో ఒకటి రాత్రి సమయంలో సరిగ్గా భోజనం తినకపోవడం ఒక కారణం. అయితే కొన్నిసార్లు కొంతమంది కడుపు నిండుగా భోజనం చేసినప్పటికీ రాత్రి సమయంలో ఏదైనా తినడం అలవాటు చేసుకుంటారు. రాత్రి పడుకునే ముందు..తినే ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవచ్చు. వీటిని తిన్న తర్వాత కడుపు రాత్రంతా నిండినట్లు అనిపిస్తుంది. అనవసరంగా తినాల్సిన అవసరం ఉండదు. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆహారాలు తినడం వలన ఆకలి వేయదు.

పాలు
రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి. ఇలా చేయడం వల్ల రాత్రంతా కడుపు నిండి ఉంటుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెలటోనిన్, సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మంచి నిద్రను పొందడానికి సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. కండరాలను పోషిస్తుంది. రాత్రి సమయంలో ఒక చిన్న గ్లాసు (150-200 మి.లీ) పాలు తాగడం వలన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్
బాదం లేదా వాల్‌నట్స్ వంటి గుప్పెడు గింజలు రాత్రికి తేలికైన, పోషకాహార చిరుతిండి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ , ఫైబర్ ఉంటాయి. ఇవి తక్షణమే ఆకలిని అణిచివేస్తాయి. చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. బాదంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రను ప్రోత్సహిస్తుంది. రాత్రి సమయంలో 5-6 బాదం లేదా 2-3 వాల్‌నట్స్ తినండి

అరటిపండు
పొటాషియం, మెగ్నీషియం , విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను సడలిస్తాయి. మంచి నిద్రను పొందడంలో సహాయపడతాయి. అరటి పండ్లలో సహజ చక్కెర , సహజ ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రాత్రి సమయంలో చిన్న లేదా మధ్య తరహా అరటిపండు తినండి. పాలతో కలిపి అరటి పండుని తినడం వల్ల ఇది మరింత పోషకమైనదిగా మారుతుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)