Lifestyle: ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..

అతిగా నిద్ర సమస్య విటమిన్‌ లోపం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలో విటమిన్‌ లోపం నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి కారణంగా మారుతుంది. దీంతో శరీరంలో ఏర్పడే విటమిన్‌ లోపం కారణంగా అలసట, బలహీనత, రక్తహీనత వంటి సమస్యలతో పాటు అధికంగా నిద్ర వంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
Over Sleep

Updated on: May 04, 2024 | 3:43 PM

ఈ మధ్య కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, షిఫ్టుల్లో పనిచేయడం కారణం ఏదైనా నిద్రకు దూరమవుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మరికొందరిలో మాత్రం అతి నిద్ర కూడా ఓ సమస్యగా మారుతోంది. ఎప్పుడూ నిద్రపోవాలన్న భావనలో ఉంటారు. ఇంతకీ తరచూ నిద్ర వస్తున్న భావన ఎందుకు కలుగుతుంది.? నిపుణులు ఏం చెబుతున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం..

అతిగా నిద్ర సమస్య విటమిన్‌ లోపం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలో విటమిన్‌ లోపం నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి కారణంగా మారుతుంది. దీంతో శరీరంలో ఏర్పడే విటమిన్‌ లోపం కారణంగా అలసట, బలహీనత, రక్తహీనత వంటి సమస్యలతో పాటు అధికంగా నిద్ర వంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల విటమిన్‌ల లోపం కారణంగా అలసట, కండరాల నొప్పి, అధిక నిద్రకు కారణమవుతుందని అంటున్నారు.

విటమిన్‌ బీ12 ఎర్ర రక్త నాళాలు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి సహాయపడుతుంది. శరీరంలో ఈ విటమిన్‌ లోపం ఉంటే రక్తహీనత, అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విటమిన్‌ డీ లోపం కారణంగా కూడా శరీరం అలసటకు గురవుతుంది. కండరా తిమ్మిర్లు, నిత్యం అలసట, అధిక నిద్ర వంటి సమస్యలు కూడా విటమిన్‌ డీ లోపం కారణాలుగా చెబుతున్నారు.

విటమిన్‌ బీ12 లోపాన్ని జయించాలంటే తీసుకునే ఆహారంలో మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఇక విటమిన్‌ డిని సహజంగా పొందడానికి రోజూ తగినంత ఎండ తగిలేలా చూసుకోవాలి. ఐరన్‌ లోపాన్ని జయించడానికి రెడ్ మీట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పప్పులు తీసుకోవాలి. నారింజ, స్ట్రాబెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..