Sleeping posture: ఎడమవైపు తిరిగి పడుకుంటే.. ఎలాంటి రోగాలు నయం అవుతాయో తెలుసా?

ఎడమవైపు తిరిగి పడుకోవడం మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో హృదయంపై ఒత్తిడి తగ్గుతుంది. గుండె సమస్యలను కూడా దూరం చేస్తుందని నిపుణులు సూచిస్తు్న్నారు. ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Sleeping posture: ఎడమవైపు తిరిగి పడుకుంటే.. ఎలాంటి రోగాలు నయం అవుతాయో తెలుసా?
Left Side Sleeping

Updated on: Jun 17, 2025 | 5:28 PM

మంచి ఆరోగ్యకరమైన నిద్ర ప్రతి ఒక్కరినీ చాలా ముఖ్యం. ఎందుకంటే.. నిద్ర వల్ల శరీరం, ప్రతి అవయవం దానికి అదిగా పునర్‌ శక్తిని సాధించుకుంటాయి. అయితే, ఇలా నిద్రపోతున్నప్పుడు సరైన దిశ కూడా చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకోసం ఎడమవైపు తిరిగి పడుకోవడం మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో హృదయంపై ఒత్తిడి తగ్గుతుంది. గుండె సమస్యలను కూడా దూరం చేస్తుందని నిపుణులు సూచిస్తు్న్నారు. ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల లింఫ్ వ్యవస్థ ద్వారా శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటకు వెళ్తాయి. దీంతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల గర్భిణీలకు మేలు కలుగుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. హెల్తీగా ఉండొచ్చు. సరిగ్గా ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల వెన్నెముకకు ఒత్తిడి కలగదు. హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. శ్వాస బాగా అందుతుంది. అలాగే నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడిని తగ్గించి శ్వాస సంబంధిత సమస్యల్ని సులువుగా తగ్గిస్తుంది. ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల పిత్తాశయం పనితీరు మెరుగవుతుంది. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. పూర్తి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎడమవైపుకు తిరిగి పడుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. గర్భిణీలు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ సులభతరం అవుతుంది. దీని వల్ల తల్లి, శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..