
ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నేటి కాలంలో వంట పద్ధతుల్లో అనేక రకాల మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నూనె రాసుకుని భోజనం చేసే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. కొత్త తరంలో చాలామంది తక్కువ నూనెతో వండడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది 'ఎయిర్ ఫ్రైయర్' ఉపయోగిస్తున్నారు.

ఇందులో బంగాళదుంపలు, చేపలు, మాంసం అన్నీ రకాల ఆహారాలను చాలా తక్కువ నూనెతో వండుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా వెజిటేబుల్స్ ఇందులో ఉడికించే ముందు కొద్దిగా నూనెను బ్రష్ చేస్తే చాలు. అయితే 'ఎయిర్ ఫ్రైయర్'లో ఉడికించిన ఆహారం మంచిదేనా? 'ఎయిర్ ఫ్రయ్యర్'లో వండటం వల్ల కలిగే నష్టాలేమిటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

'ఎయిర్ ఫ్రైయర్' చాలా ఎక్కువ వేడి వద్ద ఉడికించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ నూనె అవసరం ఉండదు. అయితే, ఈ అధిక వేడి కారణంగా వివిధ ఆహారాలలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు నాశనం అయ్యే అవకాశం ఉంది. అన్ని ఆహారాలు వండటం కోసం నిర్దిష్ట ఉష్ణ స్థాయిలు ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడం వల్ల ఆ ఆహారాలలోని పోషక విలువలు కోల్పోయే అవకాశాలు పెరుగుతాయి.

చాలా మంది వేయించిన ఆహారాలు ఇష్టంగా తింటారు. సాయంత్రం చాప్స్, కట్లెట్స్ లేదా ఫిష్ ఫ్రై వంటివి లేకుండా చాలా మందికి డిన్నర్ పూర్తికాదు. అయితే నూనెలో డీప్ ఫ్రై చేస్తే వచ్చే రుచి ఎయిర్ ఫ్రైయర్ వంటలో ఉండదు.

మార్కెట్‌లో వివిధ పరిమాణాల్లో ఎయిర్ ఫ్రైయర్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, అతిపెద్దవి కూడా ఒకేసారి నలుగురి కంటే ఎక్కువ మందికి సరిపడా ఆహారాన్ని ఉడికించలేవు. కాబట్టి నిదానంగా ఉడికించాలి. ఇది చాలా సమయం తీసుకుంటుంది.