Post Pregnancy Food: డెలివరీ తర్వాత స్త్రీలు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవలసిన పోషకాలు.. అవేమిటంటే..

|

Dec 17, 2022 | 5:44 PM

స్త్రీలు గర్భం దాల్చడం అనేది కచ్చితంగా అంత తేలికైన పని కాదు. ఈ తొమ్మిది నెలల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ వారి అనుభవాల నుంచి నేర్చుకున్న విషయాలను మీకు సలహాలుగా అందిస్తారు. అయితే గర్భం దాల్చినప్పటి

Post Pregnancy Food: డెలివరీ తర్వాత స్త్రీలు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవలసిన పోషకాలు.. అవేమిటంటే..
Post Pregnancy Diet
Follow us on

స్త్రీలు గర్భం దాల్చడం అనేది కచ్చితంగా అంత తేలికైన పని కాదు. ఈ తొమ్మిది నెలల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ వారి అనుభవాల నుంచి నేర్చుకున్న విషయాలను మీకు సలహాలుగా అందిస్తారు. అయితే గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు ఎదురైన సమస్యలు కంటే బిడ్డ పుట్టిన తర్వాత అనేక రకాల సమస్యలు ఎక్కువగా తెరపైకి వస్తాయి. ఈ సమయంలోనే అప్పుడే తల్లి అయిన స్త్రీలో శారీరక, మానసిక అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులను సానుకూలంగా, సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ప్రసవం తర్వాత మహిళలు తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తల్లి, బిడ్డల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. అయితే చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో కేవలం ఆహారం తీసుకుంటే సరిపోతుందని భావిస్తారు. కానీ డెలివరీ తర్వాత మహిళలు తమ పాత స్వభావానికి తిరిగి రావడానికి పోషకాలతో కూడుకున్న ఆహారం చాలా అవసరం.

సరైన పోషకాహారం లేకపోతే బాలింతగా ఉన్న స్త్రీ బలహీనపడవచ్చు. కాబట్టి డెలివరీ తర్వాత సరైన పోషకాహారాన్ని ఎంచుకుని తినాలని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రసవ అయిన తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇచ్చే సమయంలో బాలింతలకు ఎనర్జీతో పాటు, రక్తహీనత కూడా ఏర్పడుతుంది. అలాంటి సమయంలోనే వారు ఐరన్, క్యాల్షియం, మినరల్స్, విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మరి ప్రసవం తర్వాత మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..

డెలివరీ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

ఆరోగ్య, వైద్య నిపుణుల ప్రకారం డెలివరీ తర్వాత పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని మాత్రమే బాలింతలు తీసుకోవాలి. అలాంటి ఆహారాన్ని తినడం ద్వారా స్త్రీల శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ల కొరత ఉండదు. ఇంకా వారి ఆహారంలో ఈ పోషకాలు తప్పనిసరిగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఇనుము(ఐరన్): పిల్లల ప్రసవం తరువాత స్త్రీ శరీరం నుంచి చాలా రక్తం పోతుంది. ఫలితంగా వారితో రక్తహీనత ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్త్రీలు గార్డెన్ క్రేస్ సీడ్స్, ఎండుద్రాక్ష, ఆకుకూరలు, ఆర్గాన్ మాంసాలను ఎక్కువగా తినాలి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ శిశువు మెదడు అభివృద్ధికి మాత్రమే కాకుండా,బాలింతలలో కడుపులోని మంటను కూడా తగ్గిస్తుంది. ప్రసవం తర్వాత కలిగే సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్జి కోసం గుడ్లు ఉన్న చేపలు, లిన్సీడ్, వాల్ నట్స్‌ను తినాలి.

అయోడిన్: తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి, బిడ్డలోని రోగనిరోధకశక్తికి చాలా మేలైనవి. అయితే బిడ్డకు పాలు తాగించే స్త్రీలలో అయోడిన్ సరిపడినంత పరిమాణంలో ఉండదు.  థైరాయిడ్ పనితీరుతో పాటు తల్లిబిడ్డల మెదడు అభివృద్ధిలో అయోడిన్ సహాయపడుతుంది. దీని కోసం ఉప్పుచేపలు, పాలు, పెరుగు, జున్ను తినాలి.

కాల్షియం: గర్భధారణ, బిడ్డకు పాటు ఇచ్చే సమయంలో మహిళల శరీరంలో కాల్షియం డిమాండ్ పెరుగుతుంది. వారి ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యమైనది. కాల్షియం కోసం నువ్వులు, చిక్కుళ్లు, రాగులు, ఆకు కూరలు, పాలు, పెరుగు, పనీర్ తినాలి.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..