AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు ఎలా పళ్లు తోముతున్నారు.. ఇది తెలుసుకోకపోతే హాంఫట్..

ఉదయం బ్రష్ చేయడంలో అలసత్వం ప్రమాదానికి దారితీస్తోంది. నిమిషం కూడా కేటాయించకుండా బ్రష్ ముగించేస్తే దంతక్షయం, చిగుళ్ల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం రెండు నిమిషాలు శాస్త్రీయంగా బ్రష్ చేయడం ద్వారా ప్లేక్‌ను తొలగించి పళ్లను రక్షించుకోవచ్చని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సూచిస్తోంది.

మీరు ఎలా పళ్లు తోముతున్నారు.. ఇది తెలుసుకోకపోతే హాంఫట్..
Brushing
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: May 05, 2026 | 12:42 PM

Share

మీరు ఉదయం నిద్రలేవగానే బ్రష్ పట్టుకుని ఎంత సేపు యుద్ధం చేస్తారు? నిమిషం కూడా దాటకుండానే కడిగేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే! ముంబై నుంచి హైదరాబాద్ దాకా.. ఢిల్లీ నుంచి బెంగళూరు దాకా మెట్రో నగరాల్లో ఇప్పుడు దంత వ్యాధులు మహమ్మారిలా విస్తరిస్తున్నాయి. పట్టణాల్లో నివసించే ప్రతి ఇద్దరిలో ఒకరు దంతక్షయంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య 62 శాతం పైగా ఉంటోందని సర్వేలు చెబుతున్నాయి. దీనికి కారణం మనం తినే తిండి మాత్రమే కాదు, మనం బ్రష్ చేసే ‘శైలి’ కూడా!

​అసలు ‘రెండు నిమిషాల’ మంత్రం ఏంటి?

మనం ఏదైనా తిన్నప్పుడు దంతాలపై ‘ప్లేక్’ అనే జిగట పొర ఏర్పడుతుంది. ఇది నోట్లోని బ్యాక్టీరియాతో కలిసి యాసిడ్లను విడుదల చేసి, దంతాల ఎనామిల్‌ను తినేస్తుంది. ఈ పొరను పూర్తిగా తొలగించాలంటే కనీసం రెండు నిమిషాల పాటు శాస్త్రీయంగా బ్రష్ చేయాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (IDA) గట్టిగా చెబుతోంది. కానీ మెట్రో లైఫ్ స్టైల్‌లో ఉన్న హడావుడి వల్ల చాలా మంది 30 సెకన్లలోనే పని కానిచ్చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే చిగుళ్ల వాపుకు, నోటి దుర్వాసనకు, ఆఖరికి పళ్లు ఊడిపోయే స్థితికి దారితీస్తోంది. ​మరోవైపు, ఈ సమస్యను పరిష్కరించేందుకు టెక్నాలజీ రంగంలోకి దిగింది. ఇప్పుడు మార్కెట్లో ‘స్మార్ట్ టూత్‌బ్రష్‌ల’ హవా నడుస్తోంది. ఏఐ (AI) సాయంతో మీరు దంతాల ఏ మూల సరిగ్గా శుభ్రం చేయలేదు, ఎంత సేపు బ్రష్ చేశారు అనేది ఈ బ్రష్‌లు మీ ఫోన్‌కు డేటా పంపిస్తాయి. 2032 నాటికి ఈ స్మార్ట్ బ్రష్‌ల మార్కెట్ దాదాపు 14 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కేవలం సరైన సమయం కేటాయించకపోవడం వల్ల భవిష్యత్తులో వేల రూపాయల డెంటల్ బిల్లులు కట్టే కంటే, ఇప్పుడే ఆ రెండు నిమిషాల సమయాన్ని మీ ఆరోగ్యం కోసం కేటాయించడం తెలివైన పని. గుర్తుంచుకోండి.. మీ అందమైన చిరునవ్వుకు ఆ ‘రెండు నిమిషాలే’ శ్రీరామ రక్ష!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో