Jowar roti vs Ragi roti: బరువు తగ్గాలనుకుంటున్నారా..! జొన్న రొట్టె, రాగి రొట్టెల్లో ఏది మంచిదో తెలుసా

బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహరం కోసం ప్రజలు వెతుకుతూనే ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే రోటీల గురించి ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు లను కూడా తినే ఆహారంలో చేర్చుకున్తున్నారు. ఈ రెండు రకాల రోటీలు వాటి పోషకాలు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో ప్రసిద్ధి చెందాయి. అయితే బరువు తగ్గడానికి రెండింటిలో ఏది మంచిది. తెలుసుకుందాం.

Jowar roti vs Ragi roti: బరువు తగ్గాలనుకుంటున్నారా..! జొన్న రొట్టె, రాగి రొట్టెల్లో ఏది మంచిదో తెలుసా
Jowar Roti Vs Ragi Roti

Updated on: Aug 19, 2025 | 3:20 PM

ఈ రోజుల్లో బరువు పెరగడం ఒక సాధారణ సమస్యగా మారింది. బరువు తగ్గడానికి, వ్యాయామంతో పాటు, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా అవసరం. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఆరోగ్యకరమైన ఎంపికల వైపు మొగ్గు చూపుతారు. సాధారణంగా భారతీయులు గోధుమ రోటి తింటారు. అయితే ఆరోగ్య స్పృహ ఉన్నవారు గోధుమ రోటికి దూరంగా ఉంటారు. ఎందుకంటే గోధుమ రోటిలో ఎక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మరోవైపు దీనికి బదులుగా జొన్న రోటీ, రాగి రోటి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

జొన్నలు, రాగులు బరువు తగ్గడానికి సహాయపడే రెండు ఆరోగ్యకరమైన ఎంపికలు. ఈ రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఇందులో కనిపిస్తాయి. ఇవి బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయి. అయితే తరచుగా ప్రజలు రాగులు, జొన్నల మధ్య ఏ పిండి రోటీ తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలియక అయోమయంలో పడతారు? ఈ రోజు బరువు తగ్గడానికి జొన్న రోటీ లేదా రాగి రోటీ ఏమి మంచిదో ఈ రోజు తెలుసుకుందాం..

జొన్న రోటీలో పోషకాలు, ప్రయోజనాలు
జొన్న రోటీలో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు ఇందులో ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా మంచి మొత్తంలో ఉన్నాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ప్రోటీన్ కండరాలను పెంచడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. జొన్న రోటీ తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండి ఉంటుంది. దీంతో జొన్న రొట్టె అతిగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

రాగి రోటీ పోషకాలు, ప్రయోజనాలు
రాగి రోటీలో కాల్షియం చాలా ఉంటుంది. ఇది ఎముకలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు ఇందులో డైటరీ ఫైబర్, అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తరచుగా ఆహారం తీసుకోవాలనే కోరికను నియంత్రిస్తుంది. అదే సమయంలో దీనిలో గ్లైసెమిక్ సూచిక కూడా తక్కువగా ఉంటుంది. కనుక రాగి రొట్టె రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

రాగి లేదా జొన్న రొట్టెలో ఏది మంచిది?
రాగి రొట్టె, జొన్న రోట్టె ఈ రెండూ బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే జొన్న రొట్టెలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కడుపు తేలికగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జొన్న రోటీ బరువు తగ్గడానికి కొంచెం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో రాగి రొట్టెలో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది ఐరెన్ మంచి మూలం. ఇది చాలా కాలం పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే మీ ఆరోగ్య అవసరాన్ని బట్టి జొన్న రొట్టె లేదా రాగి రొట్టెను తినే ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)