
ఇంట్లో పచ్చని మొక్కలు ఉండటం కేవలం అందాన్ని ఇవ్వడమే కాకుండా, ఎంతో ప్రశాంతతను, సానుకూల శక్తిని అందిస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. అందులో జాడే ప్లాంట్, మనీ ప్లాంట్ ముందుంటాయి. ఇవి అదృష్టాన్ని, సంపదను ఆకర్షిస్తాయని నమ్మకం. మరి ఈ మొక్కలను ఇంట్లో ఏ దిశలో, ఎక్కడ ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జాడే ప్లాంట్ను ఆంగ్లంలో లక్కీ ప్లాంట్ లేదా క్రస్లా ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దీని చిన్న, గుండ్రని ఆకులు నాణేలను పోలి ఉంటాయి. అందుకే ఇది సంపదకు ప్రతీకగా భావిస్తారు.
ఆగ్నేయ మూల: వాస్తు శాస్త్రం ప్రకారం, జాడే ప్లాంట్ను ఇంటికి లేదా ఆఫీసుకు ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శ్రేయస్కరం. ఈ దిశకు ధనానికి అధిపతి అయిన కుబేరుడు, శుక్రుని ప్రభావం ఉంటుంది.
ప్రధాన ద్వారం వద్ద: ఇంటి ప్రధాన ద్వారానికి కుడి వైపున ఈ మొక్కను ఉంచడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది వ్యాపారంలో వృద్ధిని, కొత్త ఆదాయ మార్గాలను తెస్తుంది.
మొక్కలను ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
బెడ్రూమ్కు దూరం: జాడే ప్లాంట్ను ఎప్పుడూ పడకగదిలో లేదా బాత్రూమ్ పక్కన ఉంచకూడదు. ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఎండిపోనివ్వకండి: మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోస్తూ ఉండాలి. ఆకులు వాడిపోయినా లేదా ఎండిపోయినా వెంటనే వాటిని తొలగించాలి. ఎండిన మొక్కలు పేదరికాన్ని, దరిద్రాన్ని ఆకర్షిస్తాయని వాస్తు నమ్ముతుంది.
పరిశుభ్రత: మొక్క ఉన్న కుండీ చుట్టూ ప్రాంతం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దుమ్ము పేరుకుపోకుండా ఆ శుభ్రతను కాపాడుకోవడం మంచిది.
జాడే ప్లాంట్ లేదా మనీ ప్లాంట్ వంటి మొక్కలను సరిగ్గా అమర్చడం ద్వారా ఇంట్లో ధన ప్రవాహం మెరుగవుతుందని, కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చే ఈ మొక్కలను సరైన దిశలో ఉంచి సిరిసంపదలను ఆహ్వానించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..