శీతాకాలంలో మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతుందా? ఇలా చేస్తే ఏడాదంతా పచ్చగా..

శీతాకాలంలో ప్రతి ఇంట్లో ఉండే తులసి మొక్కల పట్ల ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో చల్లని గాలి, తేమతో కూడిన వాతావరణం కారణంగా తులసి మొక్కలు ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం, వేర్లు కుళ్ళిపోవడం వంటివి జరుగుతాయి..

శీతాకాలంలో మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతుందా? ఇలా చేస్తే ఏడాదంతా పచ్చగా..
Caring Tips For Tulsi Plant During Winter

Updated on: Nov 26, 2025 | 6:08 PM

శీతాకాలంలో ప్రకృతిలో ఎన్నో మార్పులు చోటు చేసకుంటాయి. ఈ మార్పులు మన ఆరోగ్యానికే కాదు మొక్కలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఉండే తులసి మొక్కల పట్ల ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో చల్లని గాలి, తేమతో కూడిన వాతావరణం కారణంగా తులసి మొక్కలు ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం, వేర్లు కుళ్ళిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో తులసి మొక్కల సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. శీతాకాలంలో మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఎండిపోతుందా? ఈ సమస్య నుంచి బయటపడటానికి, మొక్కను పచ్చగా పెంచడానికి ఈ ఇంట్లో తయారుచేసిన ఈ ఎరువును ప్రయత్నించండి. పచ్చగా, ఏపుగా పెరుగుతుంది. ఈ స్పెషల్‌ ఎరువు ఎలా తయారు చేయాలంటే..

తులసి మొక్కల సంరక్షణకు సహజ ఎరువు ఎలా తయారు చేయాలంటే?

ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ కాఫీ గ్రౌండ్స్, అర టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి ద్రవంగా తయీరు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ద్రవాన్ని ఎరువుగా ఉపయోగించవచ్చు. అనంతరం ఒక కత్తి లేదా చిన్న చెంచా ఉపయోగించి తులసి మొక్క మొదలు చుట్టూ కొంత మట్టిని తవ్వి దానికి ఈ ద్రవ ఎరువును కొంచెం కొంచెంగా పోయాలి. ఇది నేలకు తగినంత తేమను అందిస్తుంది.

అంతేకాకుండా ఈ ఎరువులు మొక్కకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఎక్సమ్ సాల్ట్‌లో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఆకులను పచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ ద్రవ్య ఎరువును తయారు చేసి మొక్కలకు వేయవచ్చు. కావాలనుకుంటే మొక్కలకు ద్రవ వర్మీకంపోస్ట్ ఎరువులను కూడా వేయవచ్చు. ఇలా చేయడం వల్ల శీతాకాలంలో మొక్కలు ఎండి పోకుండా పచ్చగా, చక్కగా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.