Eggs: సమ్మర్‌లో గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు!

Should You Avoid Eggs In Summer?: గుడ్లు.. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారంజ. అయితే వేసవి రాగానే మనకు తరచుగా ఒక మాట వినిపిస్తుంది. వేసవిలో గుడ్లు తినడం వల్ల శరీర వేడి పెరుగుతుందని, జీర్ణ సమస్యలు లేదా అసౌకర్యం కలుగుతుంది. కానీ ఇందులో నిజమెంత.. వేసవితో గుడ్లు తినడం సురక్షితమా కాదా.. పమ్మర్‌లో గుడ్డు వినియోగంపై పోషకాహార నిపుణులు, వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసకుందాం.

Eggs: సమ్మర్‌లో గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు!
Eating Eggs In Summer

Updated on: May 30, 2026 | 4:45 PM

సాధారణంగా మిగతా వాటిలో పోల్చుకుంటే.. గుడ్లు తక్కవ ఖర్చుతో మనకు ఎక్కవ పోషకాలను అందిస్తాయి. అయితే గుడ్ల వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కొద్దిగా అధిక థర్మిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అంటే జీర్ణక్రియ సమయంలో ఇవి శరీరం స్వల్ప వేడిని ఉత్పత్తి చేస్తాయి. కానీ ఇది మీ శరీర అంతర్గత ఉష్ణోగ్రతను ఏమాత్రం పెంచదు.. దీని వల్ల మనకు ఎలాంటి హాని జరగదు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వేసవిలో గుడ్లను మానుకోవాల్సిన అవసరం లేదరి నిపుణులు చెబుతున్నారు.

గుడ్లలోని ముఖ్యమైన పోషకాలు

గుడ్లలో అధిక నాణ్యత గల ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ డి, ఇనుము, కోలిన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కండరాల ఆరోగ్యం, శక్తి స్థాయిలను ప్రోత్సహిస్తాయి. అలాగే వ్యాయామం తర్వాత శరీరం కోలుకోవడానికి గుడ్లలోని పోషకాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనాల ప్రకారం, గుడ్లను ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులపై ఎటువంటి ప్రమాదం ఉండదు.. అలాగే  ఈ సమస్యలు స్వల్పంగా తగ్గవచ్చని పరిశీలనాత్మక అధ్యయనాలలో తేలింది.

వేసవిలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు

వేసవి కాలంలో గుడ్లు తినడం సురక్షితమే అయినప్పటికీ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని

  • నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • గుడ్లను సరిగ్గా ప్రిజ్‌లో నిల్వ చేయాలి.
  • పగిలిన లేదా దెబ్బతిన్న గుడ్లను వాడకూడదు.
  • గుడ్లను పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి.
  • వండిన గుడ్డు వంటకాలను ఎక్కువ సేపు బయట ఉంచకూడదు.

రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు?

ఆరోగ్యంగా ఉన్న చాలా మందికి మితంగా గుడ్లు తినడం పూర్తిగా సురక్షితం. అయితే ఆదర్శవంతమైన పరిమాణం అనేది వ్యక్తి వయస్సు, కార్యాచరణ స్థాయిలు, మొత్తం ఆహారం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి మారుతుంది. మూత్రపిండాల వ్యాధి , కొన్ని రకాల జీవక్రియ రుగ్మతలు లేదా నిర్దిష్ట ఆహార పరిమితులు ఉన్న రోగులు గుడ్లు తినే విషయంలో వ్యక్తిగత వైద్య సలహా తీసుకోవడం అవసరం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us