ఇల్లు శుభ్రం చేస్తున్నారా..? అయితే ఇది పక్కా తెలుసుకోండి.. లేకపోతే డేంజర్..

మన ఇల్లు అద్దంలా మెరిసిపోవాలని, సువాసనలతో గుభాళించాలని రకరకాల క్లీనింగ్ స్ప్రేలు, కెమికల్స్ వాడుతుంటాం. కానీ ఆ తళతళలాడే మెరుపు వెనుక మీ ఊపిరితిత్తులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం దాగి ఉందని మీకు తెలుసా? మీరు వాడే ఫ్లోర్ క్లీనర్లు, ఎయిర్ ఫ్రెషనర్లు మీ శ్వాసకోశ ఆరోగ్యాన్ని సైలెంట్‌గా దెబ్బతీస్తున్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

ఇల్లు శుభ్రం చేస్తున్నారా..? అయితే ఇది పక్కా తెలుసుకోండి.. లేకపోతే డేంజర్..
Is House Cleaning Damaging Your Lungs

Updated on: Feb 08, 2026 | 9:44 PM

ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ.. మీరు ఇల్లు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్న రసాయనాలు మీ ప్రాణాల మీదకు తెస్తున్నాయని మీకు తెలుసా? మనం వాడే ఫ్లోర్ క్లీనర్లు, స్ప్రేలు మన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మనం వాడే అనేక క్లీనింగ్ ప్రొడక్ట్స్‌లో ఘాటైన రసాయనాలు ఉంటాయి. ఇవి గాలిలో త్వరగా కలిసిపోతాయి. ముఖ్యంగా స్ప్రే క్లీనర్లను వాడినప్పుడు, వాటిలోని సూక్ష్మ కణాలు నేరుగా మన ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయి. పదే పదే వీటిని వాడటం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దీర్ఘకాలిక దగ్గు మరియు అలర్జీలు, ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.

మహిళల్లోనే ఈ సమస్యలు ఎక్కువ ఎందుకు?

సాధారణంగా ఇంటి పనిలో మహిళలే ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. రోజూ వాడే డిటర్జెంట్లు, సువాసన వచ్చే ఎయిర్ ఫ్రెషనర్లు, సోపుల ప్రభావానికి వారు ఎక్కువగా గురవుతారు. దీనివల్ల పురుషుల కంటే మహిళల ఊపిరితిత్తులు ఈ రసాయనాల వల్ల త్వరగా దెబ్బతినే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

రసాయనాలకు బదులుగా ఇవి వాడండి..

శుభ్రత కోసం ఖరీదైన, ఘాటైన రసాయనాలే అక్కర్లేదు. మన వంటింట్లో దొరికే సహజ పదార్థాలతో కూడా ఇంటిని మెరిపించవచ్చు.

వెనిగర్ – నీరు: అద్దాలు, గ్లాస్ టేబుల్స్ శుభ్రం చేయడానికి ఇది బెస్ట్.

వంట సోడా: మొండి మరకలను తొలగించడానికి ఉపయోగపడుతుంది.

కాస్టిల్ సబ్బు: ఇది సహజసిద్ధమైనది, సురక్షితమైనది.

హైడ్రోజన్ పెరాక్సైడ్: క్రిములను చంపడానికి దీనిని వాడవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

గాలి వెలుతురు: ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి.

మాస్క్ ధరించండి: ఘాటైన వాసనలు ఉన్నప్పుడు మాస్క్ వాడటం మంచిది.

స్ప్రేలకు దూరం: వీలైనంత వరకు స్ప్రే బాటిల్స్‌కు బదులు, బకెట్ నీళ్లలో క్లీనర్ కలిపి వాడటం సురక్షితం.

ఇల్లు శుభ్రంగా ఉండటం ఎంత ముఖ్యమో, మన శ్వాసకోశ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. ప్రకృతి సిద్ధమైన పద్ధతులను అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.