Cancer: ఇంకొంచెం చక్కెర అంటూ లాగించేస్తున్నారా.? ప్రాణానికే ప్రమాదం జాగ్రత్త..

|

Jul 29, 2024 | 8:50 AM

ఆరోగ్యంగా ఉండాలంటే దేనినైనా మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఉప్పుతో పాటు చక్కెరను మితంగా తీసుకోవాలని చెబుతుంటారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. అలాగే షుగర్‌ ఎక్కువగా తీసుకుంటే మధుమేహం, ఊబకాయం వస్తుందని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ వస్తుందని కూడా చెబుతుంటారు..

Cancer:  ఇంకొంచెం చక్కెర అంటూ లాగించేస్తున్నారా.? ప్రాణానికే ప్రమాదం జాగ్రత్త..
Sugar
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే దేనినైనా మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఉప్పుతో పాటు చక్కెరను మితంగా తీసుకోవాలని చెబుతుంటారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. అలాగే షుగర్‌ ఎక్కువగా తీసుకుంటే మధుమేహం, ఊబకాయం వస్తుందని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ వస్తుందని కూడా చెబుతుంటారు. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. దీని వల్ల శరీరం అనేక వ్యాధులకు కారణమవుతుంది. నిజానికి చక్కెర అనేది ఒక రకమైన ప్రో-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్, ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. ఇది కాలక్రమేణ క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబతుఉన్నారు. అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చక్కెరలో రసాయనాలు, హానికరమైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలను పెంచుతాయి. ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరంలో ట్యూమర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది.

ముఖ్యంగా షుగర్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇందులో ఉండే ఫ్రక్టోజ్ శరీరం లోపల గ్లూకోజ్‌గా మారుతుంది. ఫ్రక్టోజ్ మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరంలో ప్రోటీన్ సంశ్లేషణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీని వల్ల క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చక్కెర శరీరంలో జీర్ణమైనప్పుడు, పైరువిక్ ఆమ్లం శక్తితో పాటు విడుదలవుతుంది, ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలకు కారణమవుతుంది.

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఊపిరితిత్తులలో పొలుసుల కణాలను పెంచుతుంది, కణితులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో పాటు, DNA కి తీవ్ర నష్టం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..